దిశ దశ, హైదరాబాద్:
ఈనాడు గ్రూప్స్ అధినేత చెరుకూరి రామోజీరావు అనారోగ్యంతో మరణించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో ఉన్న ఆయన శుక్రవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్టార్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. శనివారం తెల్లవారుజామున ఆసుపత్రిలోనే తుది శ్వాస విడిచారు. ఆయన మృతదేహాన్ని రామోజీ ఫిలిం సిటీకి తరలించారు. 1936 నవంబర్ 16న ఏపీలోని కృష్ణా జిల్లా గుడివాడలో జన్మించిన ఆయన తెలుగు మీడియా రంగంలో తనదైన ముద్ర వేశారు. సినీ రంగంలోనూ రామోజీ రావు నిర్మాతగా వెలుగొందారు. ప్రపంచ ప్రసిద్దిగాంచిన ఫిలిం సిటీని నిర్మాణం చేశారు. డాల్ఫిన్ హోటల్స్, మార్గదర్శి చిట్స్ వంటి వ్యాపారాలకు కూడా నిర్వహించారు. శనివారం తెల్లవారు జామున వెంటిలెటర్ ద్వారా చికిత్స అందిస్తుండగా రామోజీ మరణించారు. ఆయన మరణ వార్త తెలిసిన పలువురు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.