అమీన్ పూర్ మునిసిపాలిటీలో వైవిద్యం
మహిళా దినోత్సవ వేడుకల్లో స్పెషల్ ఎఫెక్ట్
అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో అమిన్ పూర్ మునిసిపాలిటీలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ర్యాంప్ వాక్ చేయాలంటే సెలబ్రీటీలే కావాలా..? సామాన్యులూ ఇందుకు అర్హులే కదా అని అనుకున్నారు. అందునా నిత్యం ప్రజల ఆరోగ్యం కోసం శ్రమించే వారికే ఈ గౌరవం ఎందుకు ఇవ్వకూడదు అనుకున్నారు…. కార్యాచరణలో పెట్టేశారు. రాష్ట్రంలో ఏ మునిసిపాలిటీలో కూడా నిర్వహించని విధంగా ఇక్కడ ముగింపు కార్యక్రమాలు జరిగడంతో అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది. హైదరాబాద్ శివార్లలోని అమీన్ పూర్ మునిసిపాలిటీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమానికి పబ్లిక్ హెల్త్ వర్కర్క్స్ హైలెట్ గా నిలిచారు. ఈ సందర్భంగా వీరిచే ర్యాంప్ వాక్ నిర్వహించి వారికి సముచిత గౌరవం కల్పించారు. ప్రజారోగ్యం కోసం ముందుగా శ్రమించే కార్మికులచే అమీన్ పూర్ మునిసిపాలిటీలో ర్యాంప్ వ్యాక్ నిర్వహించారు. ఇందుకోసం మహిళా కార్మికులు కూడా సహజసిద్దంగా తమ యూనిఫాంలోనే ర్యాంప్ వాక్ నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షించారు. కాస్తా వైవిద్యంగా ఆలోచించినప్పటికీ పబ్లిక్ హెల్త్ వర్కర్స్ కు ప్రాధాన్యత ఇచ్చారన్న అభిప్రాయాలే ఎక్కువమంది వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ పబ్లిక్ హెల్త్ వర్కర్స్ ఎలా ర్యాంప్ వాక్ చేశారో చూడాలని ఉందా అయితే ఈ కింది లింక్ పై ప్రెస్ చేయండి.
https://twitter.com/AmeenpurM/status/1635676231172771843?t=0tSmnI5TlmR7YXwg2_4oWw&s=08