రాములమ్మ ఎమోషనల్… పాతికేళ్ల ప్రస్థానంపై ఏం చెప్తున్నారంటే..?

దిశ దశ, హైదరాబాద్:

రాములమ్మ ఎమోషనల్ గా పీలవుతున్నారా..? తనలోని భావాలను పంచిన తీరు గమనిస్తే మాత్రం అవుననే అనిపిస్తోంది. రాములమ్మ ‘ఎక్స్’ వేదికగా చేసిన కామెంట్ నెటిజన్లను భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ‘ఎక్స్’ వేదికగా ఏ అబిప్రాయాన్ని షేర్ చేశారంటే..?

‘‘25 సంవత్సరాల నా రాజకీయ ప్రయాణం , అప్పుడు ఇప్పుడు కూడా ఎందుకో సంఘర్షణ మాత్రమే నాకు ఇస్తూ వచ్చింది….

ఏ పదవి ఏనాడు కోరుకోకున్న…
ఇప్పటికీ అనుకోకున్న కూడా…

అయితే ప్రస్తుతం ఇది తెలంగాణ బిడ్డలకు చెప్పాల్సిన సత్యం

మన పోరాటం నాడు దశాబ్ధాల ముందు తెలంగాణ ఉద్యమ బాట నడిచినప్పుడు, మొత్తం అందరు తెలంగాణ బిడ్డల సంక్షేమం తప్ప, ఇయ్యాల్టి బీఆర్ఎస్ కు వ్యతిరేకం అవుతాం అని కాదు…

నా పోరాటం నేడు కేసీఆర్ గారి కుటుంబ దోపిడి, కొందరు బీఆర్ఎస్ నేతల అరాచకత్వం పై తప్ప , నాతో కలిసి తెలంగాణా ఉద్యమంలో ప్రాణం అడ్డుపెట్టి పనిచేసిన బీఆర్ఎస్ కార్యకర్తలపై మాత్రం కాదు…

రాజకీయ పరంగా విభేదించినప్పటీకి, అన్ని పార్టీల మొత్తం తెలంగాణ బిడ్డలు సంతోషంగా, సగౌరవంగా ఎన్నటికే ఉండాలనీ మనఃపూర్వకముగా కోరుకోవటం మీ రాములమ్మ ఒకే ఒక్క ఉద్దేశ్యం… ఎప్పటికీ’’

‘‘హర హర మహాదేవ్’’
అంటూ విజయశాంతి తన అభిప్రాయాన్ని షేర్ చేసుకున్నారు. ఓ వైపున బీఆర్ఎస్ పార్టీ అధినేత ప్యామిలీ అవినీతి గురించి ఎత్తిచూపుతూనే మరో వైపున తనకు పొలిటికల్ లైఫ్ ‘సంఘర్షణ’ మాత్రమే ఇస్తూ వచ్చిందంటూ చేసిన కామెంట్ ఆమెలోని ఎమోషనల్ భావాలను వ్యక్తికరించినట్టుగా స్పష్టం అవుతోంది. మరో వైపున బీఆర్ఎస్ శ్రేణులకు తాను వ్యతిరేకంగా కాదంటూ చేసిన కామెంట్ పై కూడా నెటిజన్లు స్పందిస్తున్నారు. ఏది ఏమైనా రాములమ్మ షేర్ చేసిన ఈ మెసేజ్ దేనికి సంకేతమోనన్న అనుమానం వ్యక్తం చేస్తున్నవారూ లేకపోలేదు.
https://x.com/vijayashanthi_m/status/1719405925889413136?s=20

You cannot copy content of this page