శాంతి చర్చలకు సిద్దం… కండిషన్స్ అప్లై…

మావోయిస్టు పార్టీ వెల్లడి…

దిశ దశ, దండకారణ్యం:

మధ్య భారతదేశంలో కమ్ముకున్న యుద్ద వాతావారణానికి బ్రేకులు పడనున్నాయా..? బలగాలు, మావోయిస్టు నక్సల్స్ మధ్య కొనసాగుతున్న దాడులకు పుల్ స్టాప్ పడే అవకాశం ఉందా..? తాజాగా మావోయిస్టు పార్టీ శాంతి చర్చల అంశాన్ని తెరపైకి తీసుకరావడంతో  సరికొత్త చర్చ మొదలైంది.

అభయ్ ప్రకటన…

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట విడుదల అయిన లేఖలో శాంతి చర్చల అంశాన్ని ప్రస్తావించారు. గత మార్చి 24న హైదరాబాద్ లో జరిగిన మధ్య భారతదేశంలో జరుగుతున్న యుద్ధాన్ని వెంటనే ఆపాలి, భారత ప్రభుత్వం, సీపీఐ (మావోయిస్టు) పార్టీ బేషరతుగా కాల్పుల విరమణ ప్రకటేంచి శేంతి చరచల్ప జరపాలి’ అనే అేంశేంపై మార్చి 24న హైదరాబాద్ లో శాంతి చర్చల కమిటీ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడాన్ని స్వాగతిస్తున్నామని ప్రకటించారు. అయితే చత్తీస్ గడ్, మహారాష్ట్రలోని గడ్చిరోలి, ఒడిషా, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఆపరేషన్ కగార్ పేరిట జరుగుతున్న హత్యాకాండను వెంటనే నిలిపివేయాలన్న ప్రతిపాదన చేశారు అభయ్. ఆయా రాష్ట్రాలలో జరుగుతున్న జీనోసైడ్ నిలిపివేయడంతో పాటు, ఆయా రాష్ట్రాలలో కొత్తగా ఏర్పాటు బేస్ క్యాంపులను ఏర్పాటు చేయకూడదన్న విషయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సానుకూలంగా స్పందిస్తే తాము శాంతి చర్చలకు సానుకూలంగా ఉన్నామని కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ప్రకటించారు.

గతంలోనూ…

గత సంవత్సరం కూడా చత్తీస్ గడ్ రాష్ట్రంలో శాంతి చర్చల అంశం తెరపైకి వచ్చింది. కాల్పుల విరమణ ఒప్పందంతో పాటు బేస్ క్యాంపుల ఏర్పాటును నిలిపివేయాలని, గాలింపు చర్యలను నిలిపివేయాలని అప్పుడు మాత్రమే తాము చర్చలకు ముందుకు వస్తామని మావోయిస్టు పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇదే సమయంలో చత్తీస్ గడ్ రాష్ట్రంలోని దండకారణ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టు ఏరివేత ముమ్మరంగా సాగింది. ఆ తరువాత శాంతి చర్చల ప్రతిపాదన అంశం మరుగునపడిపోయింది. తాజాగా కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ శాంతి చర్చలకు తాము సానుకూలంగా ఉన్నామని ప్రకటించినప్పటికీ ప్రభుత్వం ముందు ఉంచిన ప్రతిపాదనలపై ఎలాంటి నిర్ణయం వస్తుందోనన్నదే అంతుచిక్కడం లేదు. శాంతి చర్చలకు నక్సల్స్ ముందుకు వచ్చినప్పటికీ ఏరివేతే లక్ష్యంగా బలగాలు దండకారణ్యాన్ని జల్లెడ పట్టాయి. ఆ తరువాత చర్చల అంశం అంతగా చర్చకు రాకుండా పోయింది. తాజాగా శాంతి చర్చల కమిటీ పేరిట రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేయడం ఈ అంశాన్ని తాము స్వాగతిస్తున్నామని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. అయితే తాజా ప్రకటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందన ఎలా ఉంటుందున్నదే చర్చనీయాంశంగా మారింది.

You cannot copy content of this page