కౌశిక్ రెడ్డపై క్రిమినల్ కేసు… బీఎన్ఎస్ యాక్టులో మొట్టమొదటి ఎమ్మెల్యే

దిశ దశ, కరీంనగర్:

హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదయింది. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశంలో ఎమ్మెల్యే వ్యవహరించిన తీరుపై ఫిర్యాదు చేశారు. డీఈఓపై చర్యలు తీసుకోవాలంటూ కౌశిక్ రెడ్డి డిమాండ్ చేస్తూ ఆందోళణకు దిగారు. సమావేశానికి హాజరైన కలెక్టర్ పమేల సత్పతి సమావేశం నుండి వెల్తున్న క్రమంలో అడ్డుకుని బైఠాయించారు. అంతేకాకుండా సమవేశం రసాభసాగా కొనసాగింది. ప్రజాప్రతినిధుల మధ్య కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో సమావేశంలో గందరగోళం నెలకొంది. అయితే సమావేశం ముగిసిన తరువాత మంగళవారం రాత్రి జడ్పీ సీఈఓ శ్రీనివాస్ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వన్ టౌన్ పోలీసులు ప్రభుత్వ అధికార యంత్రాంగం విధులకు ఆటంకం కల్గించిన సెక్షన్లలో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. బారత్ న్యాయ్ సంహిత యాక్ట్ సెక్షన్ 221, 126 (2)లో ఈ కేసు నమోదు చేశారు. భారత దేశంలో బీఎన్ఎస్ యాక్టు అమల్లోకి వచ్చిన రెండో రోజు చట్టసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రతినిధిపై క్రిమినల్ కేసు నమోదు అయింది. దేశంలోనే కొత్త చట్టాల మేరకు కేసు నమోదు అయిన వ్యక్తిగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి రికార్డుల్లోకి ఎక్కారు.

You cannot copy content of this page