రూ. కోటి. 87 లక్షలు పలికిన లడ్డూ ధర

దిశ దశ, హైదరాబాద్:

వినాయక నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన లడ్డూ వేలం అనేది తెలంగాణలో హైలెట్ గా నిలుస్తోంది. నవరాత్రులు ముగిసిన తరువాత వినాయకుని ప్రతిమను నిమజ్జనానికి తీసుకెళ్లే ముందు నిర్వహాకులు వేలం వేస్తుంటారు. అయితే హైదరాబాద్ లో లడ్డూ వేలంపై క్రేజీ తీవ్రంగా ఉంటుంది. దశాబ్దాల కాలంగా కూడా బాలాపూర్ వినాయకుని లడ్డుకే ఎక్కువగా డిమాండ్ ఉండేది. కొన్నేళ్లుగా మాత్రం బాలాపూర్ లడ్డు ధరను మైమరిపిస్తున్నారు ఇతర ప్రాంతాల భక్తులు. బండ్లగుడలోని కీర్తి రిచ్‌మండ్ విల్లాస్ లో గణేష్ లడ్డూ ఈ సారి రికార్డు బ్రేక్ చేసింది. సోమవారం అర్థరాత్రి వరకు నాలుగు బ్యాచులుగా ఏర్పడి వేలం పాటలో పాల్గొన్నారు. మొత్తంగా రూ. 1,87,36,500 కోట్లు ఈ లడ్డూకు ధర పలికింది. గత సంవత్సరం ఇదే ఉత్సవ కమిటీ నిర్వహించిన వేలంలో రూ. 61 లక్షల ధర పలకగా. 2021లో రూ. 60 లక్షలు పలికింది. ఈ సారి మాత్రం మూడు రెట్లు ఎక్కువ చెల్లించేందుకు ముందుకు రావడం విశేషం. అయితే ఈ లడ్డూను ఎవరు కొనుగోలు చేశారనన్న విషయాన్ని మాత్రం నిర్వహాకులు గోప్యంగా ఉంచారు. ఈ విల్లాస్ లో విక్రయించిన లడ్డూ ద్వారా వచ్చిన ఆదాయాన్ని నిరుపేద విద్యార్థుల అభ్యున్నతి కోసం వెచ్చిస్తామని తెలిపారు.

You cannot copy content of this page