రీల్స్ క్రేజీతో లోయలో పడి…

దిశ దశ, జాతీయం:

రీల్స్ తీయాలన్న అతృత ప్రాణాలు తీస్తోందన్న విషయాన్ని గమనించినా నేటి యువత మాత్రం తమ వైఖరిని మార్చుకోవడం లేదు. సోషల్ మీడియా వేదికల్లో రీల్స్ షేర్ చేస్తే రెస్పాన్స్ బాగా ఉంటుందన్న ఆలోచనతో అనాలోచితమైన చర్యలకు పూనుకుంటున్నారు. దీంతో నిండు నూరేళ్లు జీవించాల్సిన వారు అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు. తాజాగా మహారాష్ట్రలో జరిగిన ఘటన నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటనను చూసైనా రీల్స్ క్రేజీతో కాలం వెల్లదీస్తున్న వారు అత్యుత్సాహం ప్రదర్శించకుండా ఉంటే బావుంటుంది. మహారాష్ట్రలోని ఎల్లోరా గుహలకు వెల్లే దారిలో దత్ ధామ్ ఆలయ కొండపై జరిగిన ఈ ఘటన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. శ్వేతా సుర్వాసే (23) అనే యువతి కారును వెనక్కి నడుపుతూ రీల్స్ చేస్తోంది. కొండపై తీస్తున్న ఈ రీల్స్ ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాలని చేసిన ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయింది. తన స్నేహితుడు శివరాజ్ ములే మొబైల్ లో వీడియో రికార్డు చేస్తున్న క్రమంలో కారును రివర్స్ లో నడుపుతున్న శ్వేత లోయ వద్దకు చేరుకోగానే బ్రేకులు వేయాలనుకుంది. కానీ బ్రేకు లివర్ పై కాకుండా ఎక్స్ లెటర్ పై కాలు వేయడంతో కారు అలాగే వెనక్కి వెల్లి లోయలో పడిపోయింది. నుజ్జు నుజ్జయిన కారులో చిక్కుకున్న ఆమె అక్కడికక్కడే మరణించింది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో వచ్చే లైక్స్, ఫాలోయింగ్ పిచ్చిలో పడి శృతి మించిన ప్రదర్శనలు చేస్తుండడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.

You cannot copy content of this page