దిశ దశ, హైదరాబాద్:
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన నలుగురు నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఈ కేసులో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న ప్రణిత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధా కిషన్ రావులకు సంబంధించిన బెయిల్ పిటిషన్లపై విచారించిన కోర్టు పోలీసుల భావనతో ఏకీభవించిన కోర్ట్ బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది.