నోటిపికేషన్ విడుదల
దిశ దశ, గోదావరిఖని:
ఎట్టకేలకు సింగరేణిలో ఎన్నికల నగారా మోగింది. గుర్తింపు సంఘం ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయోనని ఎదురు చూస్తున్న క్రమంలో ఎట్టకేలకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ మేరకు ఎన్నికల నోటిఫికేషన్ డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ బుధవారం విడుదల చేశారు. ఎన్నికల షెడ్యూల్ కు సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయంటే… అక్టోబర్ 28 ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు జరగనుండగా అదే రోజు పలితాలను విడుదల చేస్తారు. సెప్టెంబర్ 30న ఓటరు జాబితా డ్రాఫ్ట్, అక్టోబర్ 3న అభ్యంతరల స్వీకరణకు గడువు విధించారు. ఈ అభ్యంతరాలపై ఎన్నికల రిటర్నింగ్ అధికారు మరు నాడు తీసుకోనుండగా, 5వ తేదిన ఫైనల్ ఓటర్ లిస్టును విడుదల చేయనున్నారు. అక్టలోబర్ 6న ప్రారంభం కానున్న నామినేషన్ల దాఖలు ప్రక్రియను 7వ తేడది సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. అక్టోబర్ 9న సాయంత్రం 5 గంటల వరకు విత్ డ్రాయల్స్ కు గడువు విధించగా, 10వ తేది మద్యాహ్నం ఒంటి గంట వరకు స్క్రూటినీ ప్రక్రియ కొనసాగనుండగా, అదే రోజు మద్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు అభ్యర్థులకు గుర్తులు కెటాయించనున్నారు. అక్టోబర్ 28వ తేది రాత్రి 7 గంటల నుండి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.