భాగ్యనగరంలో 5జీ సేవలు

దక్షిణాది రాష్ట్రాల్లో అత్యంత కీలకమైన నగరాలు హైదరాబాద్, బెంగుళూర్లలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. భారత టెలికాం దిగ్గజ కంపెనీ రిలయన్స్ జియో 5జీ సేవలను ప్రారంభించింది. ఈ రెండు నగరాల్లోని వినియోగదారులు అదనపు చెల్లింపులు లేకుండా 1 జీబీపీఎస్ ప్లస్ స్పీడ్‌తో అపరిమిత డేటాను పొందుతారని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే రిలయన్స్ జియో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, వారణాసి, నాథ్‌ద్వారా (రాజస్థాన్) నగరాల్లో జియో ట్రూ 5జీ సేవలను విజయవంతంగా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. జియో తన ట్రూ-5జీ బీటా సేవలను వెల్‌కం ఆఫర్‌ కింద దశలవారీగా విస్తరించే పనిలో నిమగ్నం అయింది. అయితే 5జీ సేవలపై వినియోగదారులు తమ సలహాలు, సూచనలు ఇవ్వాలని జీయో కోరుతోంది. 5జీ సేవలను కంపెనీ 500 ఎంబీపీఎస్ నుంచి 1 జీబీపీఎస్ మధ్య ఇంటర్నెట్ స్పీడ్‌ని సబ్‌స్క్రైబర్లకు అందుస్తున్నామని, ఈ విధానం వల్ల వినియోగదారులు ఎక్కువ డేటాను సజావుగా ఉపయోగిస్తున్నారని జియో తెలిపింది. జియో అందించే ట్రూ-5జీ వెల్‌కమ్ ఆఫర్ కోసం వినియోగదారులు మినిమమ్ రూ. 239 ప్లాన్ కానీ అంతకంటే ఎక్కువతో కానీ రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.

You cannot copy content of this page