పొడి దగ్గును ఈ ఆయుర్వేద చిట్కాతో తగ్గించుకోండి !

మనలో చాలామంది చలికాలంలో దగ్గు, జలుబు, జ్వరం వంటి ఆరోగ్య సమస్యలతో బాధ పడుతుంటారు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు ఇలా వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఈ సమస్యల వల్ల ఇబ్బంది పడుతూ బాధ పడుతుంటారు. ఇవి ఎందుకొస్తాయంటే చలిగాలులు, కాలుష్యం , దోమలు కారణంగా.. వివిధ ఆరోగ్య సమస్యలు జలుబు, దగ్గు లాంటి అనారోగ్యాలు బాధిస్తుంటాయి . కొన్ని సందర్భాల్లో జలుబు, జ్వరం తగ్గినా.. దగ్గు మాత్రం అసలు తగ్గదు. కొంతమంది పొడిదగ్గుతో బాగా బాధపడుతూ ఉంటారు. ఈ ఆయుర్వేద చిట్కాని పాటించి పొడి దగ్గును తగ్గించుకుందాం.

పసుపు, ఆవు నెయ్యి

పసుపు, ఆవు నెయ్యి , వైరస్,బ్యాక్టీరియా, వాపును తగ్గించటంలో ఇది సహాయపడుతుంది. పసుపులోని ఔషధ గుణాలు వాయునాళాలు, ఊపరితిత్తులలో నిలిచిన కఫాన్ని
మొత్తాన్ని కరిగిస్తాయి. నెయ్యిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి దగ్గు నుంచి వెంటనే ఉపశమనం పొందేలా చేస్తుంది. మీరు స్టవ్ మీద బాణలి పెట్టి దానిలో దేశీ ఆవ నెయ్యి, పసుపు వేసి బాగా కాగనివ్వాలి. అది కాగిన తర్వాత స్టవ్ ఆపేసి ఆపి, అది చల్లారిని తర్వాత ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు గ్లాస్‌ పాలలో అర టీస్పూన్‌ ఈ మిశ్రమం కలిపి.. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి తీసుకుంటే చాలు పొడి దగ్గు తగ్గిపోతుంది.

You cannot copy content of this page