జీఓ విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
దిశ దశ, హైదరాబాద్:
రాష్ట్ర పంచాయితీ రాజ్ పునర్ వ్యవస్థీకరణకు సంబంధించిన ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. పంచాయితీ రాజ్ ఇంజనీరింగ్ విభాగంలో సమూల మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొద్ది సేపటి క్రితం జీఓ జారీ చేసింది. ఈ మేరకు జీఓ ఎంఎస్ నెంబర్ 18ని మే 23న రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. రాష్ట్రంలో 4 టెరిటోరియల్ చీఫ్ ఇంజనీర్ కార్యాలయాలు, 12 సర్కిల్ కార్యాలయాల్లో 8 టెరిటోరియల్ కాగా 4 విజిలెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్, 11 కొత్త డివిజన్లలో 7 రెగ్యూలర్, 4 విజిలెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్, 60 కొత్త సబ్ డివిజన్లలో 37 రెగ్యూలర్, 23 విజిలెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. మంచిర్యాల, సిద్దిపేట, భువనగిరి, వికారాబాద్, పెద్దపల్లి, మహబూబాబాద్, వనపర్తి, సూర్యపేట, నిర్మల్, హైదరాబాద్, వరంగల్, మహబూబ్ నగర్ లలో సర్కిల్ కార్యాలయాలు, గజ్వేల్, తాండూరు, ఇబ్రహీంపట్నం, హన్మకొండ, భూపాలపల్లి, దేవరకొండ, కోదాడ, కరీంనగర్, మేడ్చల్, ఖమ్మం నల్లగొండలలో డివిజనల్ ఇంజనీరింగ్ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయి. బోథ్, ఊట్నూరు 2, దిల్వార్ పూర్, డిచ్ పల్లి, దోమకొండ, సదాశివనగర్, రుద్రూర్, జుక్కల్, లక్షెట్టిపేట్, జైపూర్, రామాయంపేట్, జరాసంగం, సదాశివపేట, పుల్కల్, చిన్న కోడూరు, వికారాబాద్ 2, మక్తల్ 2, కడ్తాల్, ఆత్మకూర్, రామగుండం, జూలపల్లి, గోవిందరావుపేట్, కొత్తగూడ, కూసుమంచి, పాల్వంచ, మణుగూరు 2, గండీడ్, భూత్పూర్, గట్టు, నాంపల్లి, పెద్ద ఊర, పీఏ పల్లి, చివ్వెంల, దామెరచర్ల, నిర్మల్, ఆర్మూర్, భాన్సు వాడ, ఆసిఫాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, ఆంధోల్, సిద్దిపేట, గజ్వేల్, తాండూర్, నారాయణ్ పేట్, రంగారెడ్డి, ఇబ్రహీంపట్నం, హన్మకొండ, జనగాం, భూపాలపల్లి, సత్తుపల్లి, కొత్తగూడెం, వనపర్తి, దేవరకొండ, సూర్యపేట, కోదాడ, మిర్యాలగూడల్లో సబ్ డివిజనల్ ఇంజనీరింగ్ కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు.
Disha Dasha
1884 posts
Prev Post