వన్ నేషన్… వన్ ఎలక్షన్ పై నివేదిక…

రాష్ట్రపతికి అందించిన మాజీ రాష్ట్రపతి కమిటీ

దిశ దశ, న్యూ ఢిల్లీ:

వనే నేషన్, వన్ ఎలక్షన్ విధానంపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తుది నివేదికను తయారు చేసింది. ఈ నివేదిను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేసింది. దేశ వ్యాప్తంగా కూడా లోకసభ, శాసనసభ ఎన్నికలు ఏకకాలంలో జరగాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ విధానంపై సాధ్యాసాధ్యాలు ఎలా ఉంటాయి అన్న విషయంతో పాటు రాజకీయ పార్టీల అభిప్రాయాలు కూడా సేకరించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో ఓ కమిటీని వేయడంతో దేశంలోని ఆయా పార్టీల మనోగతం తెలుసుకుంది. దేశంలోని 47 రాజకీయ పార్టీల్లో 32 సానుకూలంగా, 15 వ్యతిరేకంగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. జాతీయ పార్టీల్లో బీజేపీ, ఎన్ పిపి అనుకూలంగా, కాంగ్రెస్, సీపీఎం, ఆప్ పార్టీలు వ్యతిరేకంగా తమ అభిప్రాయాన్ని వెల్లడించాయి. రిజిస్టర్ పార్టీల్లో బీజేడీ, ఏఐడీఎంకే, ఏజెఎస్ యు, జెడియు, ఏజీపీ, అకాలిదళ్, ఎల్ జెపి, ఎంఎన్ఎఫ్, శివసేన, అప్రాదళ్(ఎస్) మద్దుతుగా నిలవగా, టీఎంసీ, ఎంఐఎం, ఏఐయుడీఎఫ్, డీఎంకె, ఎస్పీ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఆయా రాజకీయ పార్టీల అభిప్రాయాలను క్రోడికరించిన ఈ నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్మకు మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ అందజేసింది.

You cannot copy content of this page