రంగంలోకి దిగిన సీఐడీ అధికారులు
దిశ దశ, పెద్దపల్లి:
ఇటుకబట్టిల్లో మగ్గిపోతున్న కార్మికులను కరీంనగర్ రీజియన్ సీఐడీ, లా అండ్ ఆర్డర్, లేబర్, రెవెన్యూ విభాగాలకు చెందిన అధికారుల బృందం జాయింట్ రెస్యూ ఆపరేషన్ చేసి విముక్తులను చేసింది. కరీంనగర్ డీఎస్సీ శ్రీనివాస్ కథనం ప్రకారం… సీఐడీ అడిషనల్ డీజీపీ మహేష్ ఎం భగవత్ కు పెద్దపల్లి జిల్లా గౌరెడ్డిపేట ఇటుక బట్టి యజమాని వేధింపుల కారణంగా వలస కార్మికులు మగ్గిపోతున్నారని ట్విట్ చేశారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సీఐడీ అడిషనల్ డీజీపీ మహేష్ ఎం భగవత్ కరీంనగర్ సీఐడీ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బుధవారం సీఐడీ సీఐ బి తిరుపతి రెడ్డి, పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్, ఎస్సై రాజేశ్, సీఐడీ ఎస్సై ఎ మల్లేశం, మహిళా ఎస్సై జి సుమలత, హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్ లు గౌరెడ్డిపేట ఎన్బీసీ బ్రిక్స్ వద్దకు వెల్లారు. అలాగే పెద్దపల్లి లేబర్ ఆఫీసర్ రాంమోహన్ రావు, రెవెన్యూ ఇన్స్ పెక్టర్ నవీన్ రావులు కూడా బ్రిక్స్ ఇండస్ట్రీ వద్దకు చేరుకున్నారు. బ్రిక్స్ ఇండస్ట్రీలో యజమాని వేధింపుల వల్ల మగ్గిపోతున్న ఐదుగురు కార్మికులు, ఒక మైనర్ బాలున్ని రెస్క్యూ ఆపరేషన్ చేసి విముక్తిల్ని చేశారు. ఈ ఆపరేషన్ లో కృష్ణ మాజి (34), చేతన్ భాగ్ (26), నగేష్ దొర (22), సరస్వతి మాజి (30), బాలామటి భాగ్ (72), 10 ఏళ్ల మైనర్ బాలున్ని వారి స్వస్థలమైన ఒడిషాలోని బార్గార్డ్ జిల్లా పెద్దంపూర్ కు పంపించారు.