దిశ దశ, కరీంనగర్:
అర్థరాత్రి కరీంనగర్ శివార్లలోకి ఎంట్రీ ఇచ్చిన ఎలుగు బంటి ఇంకా నగరంలోనే తచ్చాడుతోంది. రేకుర్తి చౌరస్తాలో ఎలుగుబంటి సంచరిస్తుండడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. పోలీసుల బందో బస్తు నడుము రెస్క్యూ ఆపరేషన్ మొదలైంది. శుక్రవారం అర్థరాత్రి శ్రీపురం కాలనీ, రిజ్వీ చమన్ తదితర ప్రాంతాల్లో సంచరించిన ఎలుగుబంటిని వెల్లగొట్టేందుకు స్థానిక యువత గస్తీ చేపట్టింది. అయితే శనివారం తెల్లవారు జామును రేకుర్తి శుభం గార్డెన్ సమీపంలో సంచరించిన ఎగులుబంటి తెల్లవారే సరికి సమీపంలోని ప్రధాన రహాదారి మీదుగా, కాలనీల్లో సంచరిస్తుండడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. అటవీ శాఖ అధికారులు ఎలుగుబంటిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఎనిమల్ రెస్క్యూ వ్యాన్ ను తీసుకొచ్చని అటవీ శాఖ అధికారులు ఎలుగుబంటిని పట్టుకునేందుకు వలలతో పాటు ఇతరాత్ర సరంజామాతో రేకుర్తి చేరుకున్నారు. అయితే రెస్క్యూ టీంకు చిక్కకుండా కాలనీల్లో తప్పించుకుంటూ ఎలుగుబంటి తిరుగుతోంది. దాని వెంటే రెస్క్యూ టీమ్ పరిగెత్తుతు వలపన్ని పట్టుకునే పనిలో నిమగ్నం అయింది. లేనట్టయితే గన్ సాయంతో మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఎలుగుబంటిని పట్టుకుని వ్యాన్ లో తరలించే అవవాశాలు ఉన్నాయి. రేకుర్తి సెంటర్ లో ప్రస్తుతం ఎలుగుబంటిని పట్టుకునేందుకు ప్రత్యేక ఆపరేషన్ అయితే కొనసాగుతోంది.
Disha Dasha
1884 posts
Prev Post
Next Post