కర్రెగుట్ట ఎన్ కౌంటర్ మృతుల్లో కాటారం వాసి..?


దిశ దశ, భూపాలపల్లి:

తెలంగాణ, చత్తీస్ గడ్ సరిహధ్దుల్లో శనివారం జరిగిన ఎన్ కౌటర్ లో కాటారం మండలానికి చెందిన అజ్ఞాత నక్సల్ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. శనివారం తెల్ల వారు జామున జరిగిన ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మరణించిన సంగతి తెలిసిందే. ఇందులో ఒకరిని పోలీసులు గుర్తించినట్టుగా సమాచారం. మృతుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం అంకుసాపూర్ గ్రామానికి చెందిన అన్నె సంతోష్ అలియాస్ సాగర్ గా అనుమానిస్తున్నారు. సీఆర్సీ-2 డీవీసీఎం కమాండర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్టుగా పోలీసు వర్గాల సమాచారం. అన్నె సంతోష్ కు సంబంధించిన వివరాలను తెలుసుకుంటున్న పోలీసు అధికారులు అతని కుటుంబ సభ్యుల ద్వారా నిర్దారించుకునే పనిలో నిమగ్నం అయినట్టు సమాచారం. మృతుని ఆనవాళ్లను సేకరించి ప్రాథమికంగా నిర్దారించినప్పటికీ సమగ్రంగా తెలుసుకున్న తరువాతే వివరాలు వెల్లడించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. అలాగే ఈ ఎధురు కాల్పుల్ో మిగతా ఇద్దరిని గుర్తించే పనిలో పోలీసు వర్గాలు నిమగ్నం అయ్యాయి. ఈ ఘటనలకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

You cannot copy content of this page