దిశ దశ, హైదరాబాద్:
తెలంగాణ గవర్నర్, పుదుచ్ఛేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్ బాధ్యతలకు రాజీనామా చేశారు. కొద్ది సేపటి క్రిత తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపిచినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రపతి ఆమోదం పొందిన తరువాత తమిళిసై బాధ్యతల నుండి తప్పుకోనున్నారు. రానున్న లోకసభ ఎన్నికల్లో బరిలో నిలవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు అధిష్టానం కూడా క్లియరెన్స్ ఇవ్వడంతో ఆమె తన పదవికి రాజీనామా చేశారని తెలుస్తోంది. ఈ లోకసభ ఎన్నికల్లో చెన్నై ‘సెంట్రల్’ సౌత్ స్థానం నుండి తమిళిసై పోటీ చేయనున్నట్టు సమాచారం. అయితే తమిళిసై రాజీనామా గురించి అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది. 2019 వరకు తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేసిన తమిళి సై పేరు జాతీయ పార్టీ విడుదల చేయనున్న మూడో జాబితాలో వచ్చే అవకాశం ఉంది.
