తీర్మానాలను వెంటనే రద్దు చేయాలి

మున్సిపల్ కౌన్సిలర్లు

దిశ దశ, హుజురాబాద్:

హుజురాబాద్ అసమ్మతి కౌన్సిలర్లు సరికొత్త పల్లవి ఎత్తుకున్నారు. కోరం లేకుండా చేసిన తీర్మానాలు చెల్లవంటూ వాదిస్తున్నారు. ఈ తీర్మానానలు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కమిషనర్ కు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ఈనెల ఆరవ తేదీన మున్సిపల్ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారని ఈ సమావేశం కోరం లేక వాయిదా పడిందన్నారు. ఈ సమావేశాన్ని 216 ప్రకారం 6 గంటల నుండి 24 గంటల్లోగా ఏర్పాటు చేయాల్సి ఉండగా రెండు రోజుల తర్వాత నిర్వహించడం నిభందనలకు విరుద్దమన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు సెలవు దినంగా ప్రకటించినప్పటికీ మహిళా అకౌంటెంట్, మున్సిపల్ చైర్ పర్సన్ మహిళా అయినప్పటికీ ఆరోజు సమావేశం ఎలా నిర్వహించారని కౌన్సిలర్లు ప్రశ్నించారు. కోరం లేకుండా జీవో ద్వారా ఆమోదం తెలిపే అవకాశం ఉన్నప్పటికీ సమావేశం వాయిదా పడిన మూడు రోజులకు మీటింగ్ ఏర్పాటు చేశారన్నారు. అది కూడా సెలవు రోజున అత్యవసర సమావేశం నిర్వహించారన్నారు. స్లీపింగ్ మిషన్ కొనుగోలు, డీజిల్ తదితర విషయాలపై మున్సిపల్ కమిషనర్ ను వివరాలు అడగగా దాటవేస్తున్నారే తప్ప సమాధానం చెప్పడంలేదని వారు ఆరోపించారు. ఎజెండాలో లేని 16 అంశాలను చైర్పర్సన్ ఎలా ఆమోదించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ కొలిపాక నిర్మల, కౌన్సిలర్లు ముక్క రమేష్, పైళ్ళ వెంకట్ రెడ్డి, తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, ఉజ్మ నూరిన్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page