టీఎస్‌పీఎస్సీ ఉమెన్ డెవలప్‌మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌లో ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్-సూపర్‌వైజర్ గ్రేడ్-1 పోస్టుల భర్తీకి జనవరి 8న నిర్వహించిన విషయం తెలిసిందే. రాతపరీక్ష ఫైనల్ ఆన్సర్ కీని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫిబ్రవరి 22న విడుదల చేసింది.పేపర్-1,పేపర్-2 ఆన్సర్ కీ లను అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/ లో అందుబాటులో ఉంచింది.
అయితే దానిపై అభ్యంతరాల స్వీకరణ అనంతరం ఫైనల్ కీని తాజాగా విడుదల చేసింది.ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఆన్సర్ కీ చెక్ చేసుకోవచ్చు. ఫైనల్ కీ విడుదల కావడంతో ఇక త్వరలోనే ఫలితాలను విడుదల చేయడానికి టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉమెన్ డెవలప్‌మెంట్ అండ్ ఛైల్డ్ వెల్ఫేర్ డెవలప్‌మెంట్‌లో 181 ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (సూపర్‌వైజర్) పోస్టుల భర్తీకి ఆగస్టు 27న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఈ పోస్టుల భర్తీకి సెప్టెంబరు 8 నుంచి 29 వరకు దరఖాస్తులు స్వీకరించారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాతపరీక్ష హాల్‌టికెట్లను జనవరి 2న విడుదల చేసింది.అలాగే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల పరిధిలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల్లో జనవరి 8న రాతపరీక్ష నిర్వహించింది. పరీక్షకు సంబంధించిన ప్రిలిమినరీ కీని జనవరి 20న విడుదల చేసింది. ఆన్సర్ కీపై జనవరి 24 వరకు అభ్యంతరాలు స్వీకరించింది. అనంతరం ఫిబ్రవరి 22న ఫైనల్ కీని విడుదల చేసింది. ఫలితాలను త్వరలో వెల్లడించనుంది.