సుపారీ గ్యాంగ్ హైర్ చేసిన కేసులో

దాసరి భూమయ్య అరెస్ట్

దిశ దశ, హైదరాబాద్:

రిటైర్డ్ సీఐ దాసరి భూమయ్యను హైదరాబాద్ సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. తన శత్రువును హతమార్చేందుకు ఓ సూపారి గ్యాంగ్ ను హైర్ తీసుకుని స్కెచ్ వేశాడన్న ఆరోపణలపై సోమవారం హైదరాబాద్ సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు సీపీ సివి ఆనంద్ వివరాలను మీడియకు వెల్లడించారు. సోమవరాం ఉదయం కరీంనగర్ లోని ఆయన ఇంటి నుండి గోపాలపురం పోలీసులు అదుపులోకి తీసుకుని వెల్లగా ఓ హత్యకు ప్లాన్ చేసిన కేసులో అరెస్ట్ చేసినట్టు సీపీ తెలిపారు. 2018లో ఆదాయానికి మించిన ఆస్థుల కేసులో దాసరి భూమయ్యను ఏసీబీ అరెస్ట్ చేయగా కొంతకాలం జ్యూడిషియల్ రిమాండ్ విధించిన తరువాత బయటకు వచ్చాడని సీపీ తెలిపారు. అయితే ఈ ఏసీబీ దాడులకు మూల కారకుడు రియాల్టర్ ఎక్కటి విజయపాల్ రెడ్డి అన్న అనుమానంతో అతని హత్యకు ప్లాన్ చేశాడన్నారు. భూమయ్య తనకు అత్యంత సన్నిహితుడైన పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లికి చెందిన మామిడి చంద్రయ్య అలియాస్ చందు అలియాస్ చందు యాదవ్ (47) ప్రస్తుతం పెద్దపల్లి పట్టణంలో నివసిస్తున్నాడని సీవి ఆనంద్ వివరించారు. విజయపాల్ రెడ్డిని హతం చేయాలని నిర్ణయించుకుని ఈ ఏడాది మార్చి నెలలో చంద్రయ్యతో దాసరి భూమయ్య చర్చించాడని తెలిపారు. విజయపాల్ రెడ్డి హత్య చేసేందుకు రూ. 40 నుండి 50 లక్షలు వరకు అయినా ఖర్చు చేద్దామని ఇందుకు అవసరమైన కిల్లర్స్ ను మాట్లాడాలని చంద్రయ్యతో చెప్పాడని వివరించారు. అనంతరం చంద్రయ్య మాజీ నక్సల్ శంకర్ ను కాంటాక్ట్ కాగా ఆయన గడ్డం కుమార్ సంప్రదించి అతన్ని కూడా భాగస్వామిని చేయాలని నిర్ణయించుకున్నాడన్నారు. మొత్తంగా విజయపాల్ రెడ్డి హత్యకు రూ. 20 లక్షల సూపారి డిసైడ్ కాగా అడ్వాన్స్ గా రూ. 5 లక్షలు మామిడి చంద్రయ్యకు ఇవ్వగా వాటిని సూపారి గ్యాంగ్ కు అప్పగించారని సీపీ తెలిపారు. గడ్డం కుమార్ బీహార్ లో కంట్రిమేడ్ పిస్టల్ కొనుగోలు చేశాడని తెలిపారు. ఈ గ్యాంగ్ ఎల్ బి నగర్ లోని అష్టలక్ష్మీ టెంపుల్ ఏరియాలో ఉంటున్న విజయపాల్ రెడ్డి కోసం రెక్కీ నిర్వహించారన్నారు. విజయపాల్ రెడ్డి ఫోటోను దాసరి భూమయ్య చంద్రయ్యకు పంపించగా, మామిడి చంద్రయ్య సికింద్రాబాద్ లోని ఓ హోటల్ లో బస చేసి తమ ప్లాన్ ను అమలు చేసే పనిలో నిమగ్నం అయ్యాడని సీపీ సివి ఆనంద్ వెల్లడించారు. ఈ సమాచారం నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం వచ్చిందన్నారు. ఈ మేరకు నార్త్ జోన్, గోపాలపురం పోలీసులు నిందితులను జాయింట్ ఆపరేషన్ లో పట్టుకున్నారని చెప్పారు. ఈ ఆపరేషన్ లో టాస్క్ ఫోర్స్ డీసీపీ పి రాధా కిషన్ రావు, ఇన్స్ పెక్టర్ టి శ్రీనాథ్ రెడ్డి, ఎస్సైలు బి అశోక్ రెడ్డి, కె శ్రీకాంత్, ఎం అనంతా చారి, బి అరవింద్ గౌడ్ లు పాల్గొన్నారని సీపీ వివరించారు. ఈ కేసులో రిటైర్డ్ సీఐ దాసరి భూమయ్య, మామిడి చంద్రయ్య, గొర్రె రాయగొల్ల అలియాస్ శంకర్, గడ్డం కుమార్ లను అరెస్ట్ చేశామని తెలిపారు. నిందితుల నుండి ఒక కంట్రి మేడ్ తుపాకి, రెండు కొడవల్లు, ఆరు సెల్ ఫోన్లు, రూ. లక్ష నగదు స్వాధీనం చేసుకున్నట్టు సీపీ సివి ఆనంద్ వివరించారు.

You cannot copy content of this page