ఎంపీ సంతోష్ రావు ఫ్యామిలీపై రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ ఫైర్

తనయుడు పర్యావరణ కాపాడితే తండ్రి నాశనం చేస్తున్నాడు

దిశ దశ, కరీంనగర్:

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ రావు కుటుంబంపై రిటైర్డ్ పోలీసు ఆఫీసర్ దాసరి భూమయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. తనయుడు గ్రీన్ ఛాలేంజ్ పేరిట పర్యావారణాన్ని కాపాడుతుంటే ఆయన తండ్రి రవిందర్ రావు నాశనం చేసే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గురువారం కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ప్రోటోకాల్ విషయంలో అటు మంత్రులు, ఇటు ఉన్నతాధికారులు విస్మరించడంపై కూడా ఆయన ఆక్షేపన వ్యక్తం చేశారు. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా కొండగట్టుకు వచ్చిన రాజ్యసభ సభ్యున్ని మంత్రులు, ఉన్నతాధికారులు ఆయన్ని వెల్లి కలవడం, ఆయనతో పాటు కార్యక్రమాల్లో పాల్గొనడం సరికాదన్నారు. ప్రోటోకాల్ ను పక్కనపెట్టి ఆయనకు ప్రాధాన్యత ఇవ్వడం ఏంటని దాసరి భూమయ్య ప్రశ్నించారు. ఇలా చేయడం వల్ల క్షేత్ర స్థాయి అధికార యంత్రాంగంపై కూడా ప్ఱభావం చూపుతుందన్నారు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న సంతోష్ రావు తండ్రి రవిందర్ రావు వ్యవహారంపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. పోలీసుల అండదండతో… కరోనా కాలంలో కూడా ఇసుక అక్రమ రవాణా చేసిన చరిత్ర రవిందర్ రావుకు ఉందని దుయ్యబట్టారు. నిభందనలకు విరుద్దంగా ఇసుక దందా కొనసాగిస్తున్నా వారిని కట్టడి చేసే వారే లేకుండా పోయారని దాసరి భూమయ్య వ్యాఖ్యానించారు. రవిందర్ రావు వ్యవహారాలను కట్టడి చేసేందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్సీ చొరవ తీసుకోవాలని కోరారు. రవిందర్ రావు బినామీపై 10కి పైగా కేసులు ఉన్నాయని, అతను రవిందర్ రావు దత్త పుత్రుడు కావడం వల్లే పోలీసులు పట్టించుకోవడం లేదని దాసరి భూమయ్య ఆరోపించారు. వే బిల్లులను రీ సైక్లింగ్ చేస్తూ ఇసుక అక్రమ దందాలకు పాల్పడుతున్నారని రవిందర్ వుపై దాసరి భూమయ్య ధ్వజమెత్తారు. ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేయడం పక్కనపెట్టి ముందుగా తన తండ్రి రవిందర్ రావు చేస్తున్న అక్రమాలపై ఛాలెంజ్ విసరాలని భూమయ్య సవాల్ విసిరారు. నిజంగా తప్పు చేయనట్టయితే ఛాలెంజ్ కు రావాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ధరణిని అడ్డుగా పెట్టుకుని ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ ను కొల్లగొట్టే కుట్ర జరుగుతోందని, ఈ కారణంగానే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ వ్యవహారాన్ని తహసీల్దార్లకు బదలాయించారన్నారు. రిజిస్ట్రేషన్ శాఖలో ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ అని రికార్డుల్లో ఉండడంతో ఆ భూములపై రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఉండదన్న ఉద్దేశ్యంతోనే రెవెన్యూ విభాగానికి బదలాయించారని దాసరి భూమయ్య ఆరోపించారు. కరీంనగర్ లో శ్మశాన వాటికను కూడా వదిలిపెట్టలేదని మండిపడ్డారు. మంత్రిని దూషించిన కన్నారావుపై కేసు నమోదు చేయకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు.

You cannot copy content of this page