రేవంత్ పాదయాత్రకు ఆదిలోనే చిక్కులు,.., అరెస్ట్ తప్పదా..?

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి పాదయాత్రకు ప్రారంభంలోనే చిక్కులు వచ్చి పడుతున్నాయి. ఆయన చేసే వ్యాఖ్యలు రేవంత్‌కు ఇబ్బందులు తెచ్చి పెడుతున్నాయి. పాదయాత్ర ప్రారంభంలోనే సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. పాదయాత్రలో భాగంగా ఏకంగా ప్రగతిభవన్‌ను నక్సలైట్లు కూల్చేయాలని రేవంత్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయడంతో పాటు డీజీపీగా కూడా కంప్లైంట్ ఇచ్చారు. దీంత రేవంత్ పై కేసు నమోదు చేసే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే రేవంత్‌ను అరెస్ట్ చేసే అవకాశం లేకపోలేదని, ఇదే జరిగితే రేవంత్ పాదయాత్రకు బ్రేకులు పడతాయని అంటున్నారు. గతంలో షర్మిల పాదయాత్రలో ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, బీఆర్ఎస్ కార్యకర్తలు ఆమె కారవాన్ పై దాడి చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో షర్మిలను పోలీసుులు అరెస్ట్ చేసి లోటస్ పాండ్ కు తరలించడంతో పాదయాత్రకు బ్రేకులు పడ్డాయి,.

ఇప్పుడు రేవంత్ పాదయాత్రలో కూడా అలాగే జరిగే అవకాశం లేకపోలేదని రాజకీయాలు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే రేవంత్ సంచలన వ్యాఖ్యల వెనుక వ్యూహం ఉందనే చర్చ జరుగుతోంది. పాదయాత్రకు మైలేజ్ వచ్చేందుకు ఇలా సంచలన వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. తర్వారా జనాల చూపు తన పాదయాత్రపై ఉంటుందని అంటున్నారు. పాదయాత్రలు చేసే రాజకీయ నేతలు ఇలాంటి స్ట్రాటజీలను ఫాలో అవుతున్నారని, పాదయాత్రపై ప్రజల దృష్టి పడేందుకు ఇలా సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో ఉంటారని చెబుతున్నారు.

అయితే ప్రగతిభవన్ వల్ల ఎవరికీ లాభం లేదని, నక్సలైట్లు దానిని కూల్చేసినా ఎవరికీ అభ్యంతరం ఉండదని వ్యాఖ్యానించారు. సామాన్యులకు ప్రగతిభవన్‌లోకి ప్రవేశం లేదని, ఒక్కరైనా అందులోకి వెళ్లారా అని ప్రశ్నించారు. వేల కోట్లు పెట్టి ప్రగతిభవన్ కట్టారని, దాని వల్ల లాభం ఎవరికని రేవంత్ ప్రశ్నించారు. ప్రస్తుతం రేవంత్ పాదయాత్ర ములుగు జిల్లాలో జరుగుతోంది. దాదాపు రెండు నెలల పాటు 50 నియోజకవర్గాల్లో రేవంత్ పాదయాత్ర సాగనుంది.

You cannot copy content of this page