ఐయాం వెరీ సారీ: గద్దర్

దిశ దశ, హైదరాబాద్:

ప్రజా యుద్ద నౌక గద్దర్ తెలంగాణ ప్రజలను క్షమాపణలు కోరారు. తాను కూడా కేసీఆర్ పల్లకి మోసానని అందుకే సారీ చెప్తున్నానని అన్నారు. గురువారం హైదరాబాద్ లో ఆయన మీడియాతో ఈ వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. తెలంగాణ అన్యాయం అయిపోయిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ ను దించే వరకూ తాను నిద్రపోనని శపథం చేశారు. కేసీఆర్ పని కూడా అయిపోయిందని, డబ్బు ఉందన్న అహంకారంతో కేసీఆర్ ఉన్నాడని మండిపడ్డారు. కేసీఆర్ పై పోరాటం చేసేందుకు అందరం మళ్లీ ఏకం కావల్సిన అవసరం ఏర్పడిందని, ఆయనపై పోరాటం చేసేందుకు తాను ముందుంటానని గద్దర్ ప్రకటించారు. వినతిపత్రం ఇవ్వడానికి వెల్తే గేట్ దగ్గరే గంట సేపు నిలబెట్టి అపాయింట్ మెంట్ ఇవ్వకుండా తిప్పి పంపించేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పొలిటికల్ పార్టీల సపోర్ట్ లేకుండా ఏ ప్రజా సంఘం ముందుకెళ్లదని, సంఘాలు పార్టీలకు అతీతంగా కేసీఆర్ పై పోరాటం చేయాలని అభిప్రాయపడ్డారు. సీఎం కేసీఆర్ ఎక్కడ నిలబడితే తాను అక్కడికి వెల్తా పాట పడుతానని ప్రకటించారు. వాజ్ పేయి కలిశాడు, అమిత్ షా పలికరిస్తాడు అంబానీ టైం ఇస్తాడు కానీ కేసీఆర్ మాత్రం కలవడని దుయ్యబట్టారు. గేట్ వద్దే ఆపేస్తాడని, ప్రజలను తనను క్షమించాలని అభ్యర్థించారు. అందరికీ సారీ చెప్తున్నా… ప్రజల కోసం ఏమీ చేయలేకపోయా, అందరం కలిసి కూర్చొని కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేద్దామంటూ గద్దర్ పిలుపునిచ్చారు. టార్గెట్ కేసీఆర్ లాగా పనిచేయాల్సిన ఆవశ్యకత ఉందని, ఆయన ఓ కాగితం పులని, ఎరా ముగిసిపోయిందంటూ గద్దర్ వ్యాఖ్యానించారు.

You cannot copy content of this page