మోడీ క్యాబినెట్… తెలుగు రాష్ట్రాల రికార్డు…

కుబేరున్నికుచేలున్ని అందించిన ప్రజలు

దిశ దశ, హైదరాబాద్:

ముచ్చటగా మూడోసారి ప్రధాన మంత్రి పదవిని అలంకరించిన నరేంద్ర మోడీ హ్యాట్రిక్ అందుకున్న పీఎంల జాబితాలో రెండో వ్యక్తిగా నిలిచారు. 1952 నుండివ 1962 వరకు భారత తొలి ప్రధానం జవహార్ లాల్ నెహ్రు వరసగా మూడు సార్లు ప్రధాని అయ్యారు. ఆ తరువాత మూడు సార్లు ప్రధానమంత్రి పీఠం అధిష్టించిన వారే లేరు. నరేంద్ర మోడీకి మాత్రమే ఈ క్రెడిట్ దక్కింది. 2014 నుండి 2024 వరకు జరిగిన లోకసభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించి మూడు సార్లు ప్రధని బాధ్యతలు చేపట్టారు. అయితే మూడో సారి ప్రభుత్వ ఏర్పాటులో తెలుగు రాష్ట్రాలు బీజేపీకి వెన్నుదన్నుగా నిలవడంలోనూ క్రీయాశీలక పాత్ర పోషించాయి. తెలంగాణ నుండి 8 మంది బీజేపీ ఎంపీలు గెలవగా ఏపీలో ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు 21 స్థానాలను కైవసం చేసుకున్నాయి. 29 స్థానాలను ఒక్క తెలుగు రాష్ట్రాల నుండే ఎన్దీఏ కూటమి సాధించుకుంది.

కుబేరుడు… కుచేలుడు…

అయితే తాజాగా కొలువు దీరిన మోడీ 3.0 క్యాబినెట్ కూర్పులో కూడా తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇచ్చినట్టయింది. ఏపీ నుండి కింజారపు రాంమ్మెహన్ నాయుడు, డాక్టర్ పెమ్మసాని చంద్ర శేఖర్, భూపతి రాజు శ్రీనివాస్ వర్మలకు అవకాశం దక్కగా, తెలంగాణ నుండి గంగాపురం కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ లు కేంద్ర మంత్రులుగా బాధ్యతలు చేపట్టారు. అయితే ఏపీ, తెలంగాణాల నుండి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిథ్యం వహిస్తున్న ఇద్దరు ఎంపీలు మరో రికార్డును అందుకున్నారు. గుంటూరు ఎంపీగా గెల్చిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, కరీంనగర్ నుండి లోకసభలో రెండోసారి అడుగుపెట్టిన బండి సంజయ్ కుమార్ లు అరుదైన చరిత్ర సృష్టించారనే చెప్పాలి. నరేంద్ర మోడీ మంత్రివర్గంలో అత్యంత ధనవంతుడిగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ రికార్డుకెక్కారు. ఆయన రూ. 5705 కోట్ల ఆస్తులు ఉన్నట్టుగా తన అఫడవిట్ లో పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా పోటీ చేసిన ఎంపీ అభ్యర్థుల్లోనూ డాక్టర్ పెమ్మసాని అత్యంత సంపన్నుడని తెలుస్తోంది. అయితే కరీంనగర్ నుండి ప్రాతినిథ్యం వహిస్తున్న బండి సంజయ్ రెండో సారి ఎంపీ అయి క్యాబినెట్ లో అవకాశం దక్కించుకున్నారు. ఆయన ఆస్థి మొత్తం కలిసి రూ. రూ. కోటి పై చిలుకు  మాత్రమే కావడం గమనార్హం. రెండు తెలుగు రాష్ట్రాల నుండే కుబేర, కుచేలులు మోడీ మంత్రి వర్గంలో ప్రాతినిథ్యం వహిస్తుండడం గమనార్హం.

You cannot copy content of this page