టర్కీ, సిరియా దేశాల్లో భారీ భూకంపం వచ్చిన విషయం మనకి తెలిసిందే. దీని వల్ల ఇప్పటికే చాలా నష్టం జరిగింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 7.8 గా నమోదు అయింది . ఇప్పటికి మూడు సార్లు టర్కీ ని, సిరియా దేశాలను భూకంపం వణికించింది. రికార్డుల చూసుకుంటే రిక్టర్ స్కేల్‌పై 4 కంటే ఎక్కువ స్థాయిలో 100 సార్లకు పైగా టర్కీలో భూమి కంపించిందని పలు మీడియా సంస్థలు వెల్లడించాయి. ఈ విషయాన్ని అమెరికా జియోలాజికల్ చేసిన సర్వే లో తెలిసింది. అంతే కాకుండా భవిష్యత్తులో కూడా 5 నుంచి 6 తీవ్రతతో ఈ ప్రకంపనలు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు తేల్చి చెప్పేశారు.
టర్కీ, సిరియా దేశాల్లో ప్రకృతి విలయతాండవం వల్ల భవనాలన్ని కుప్ప కూలిపోయాయి.. మరోవైపు విద్యుత్తు వ్యవస్థ, వాటర్ పైపు లైన్లు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరుస భూకంపాల కారణంగా ఇప్పటివరకు టర్కీ, సిరియా దేశాల్లో 5 వేల మందికి పైగా మరణించారని మీడియా సంస్థలు వెల్లడించాయి. ఇంకో వైపు వేల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. శిథిలాల కింద చిక్కుకున్న ప్రాణాలెన్నో ..వారిని బయటకు తీయడానికి
సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
టర్కీలో ఇప్పటివరకు 4వేల మందికి పైగా మృతి చెందినట్లు తెలిసింది. సిరియాలో 1500 మందికి పైనే ప్రాణాలను పోగొట్టుకున్నారు. మొత్తం రెండు దేశాల్లో కలిపి మొత్తం 5వేల మందికి పైగా మరణించారని వెల్లడించారు. టర్కీలో మొత్తం 20వేల మందికి పైగా గాయపడగా..వారిలో చాలామందిని ఆసుపత్రికి తరలించారు. సిరియాలో మొత్తం 2 వేలకు మందికి పైగా గాయపడ్డారు.