Sand Policy: సాండ్ VS రోబో సాండ్…

దిశ దశ, హైదరాబాద్:

ఇసుక ద్వారా వచ్చే ఆదాయాన్ని పెంచాలన్నయోచనతో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇసుక రీచుల్లో ఎలాంటి ప్రక్షాళన చేస్తే రెవెన్యూ పెరుగుతుంది అన్న విషయాలపై దృష్టి పెట్టింది. భుగర్భ గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ సమగ్రంగా అధ్యయనం చేస్తున్నారు. ఇప్పటికే ఓవర్ లోడ్ విధానం, జీరో రవాణా వంటి చర్యలను కట్టడి చేసే పనిలో నిమగ్నం అయ్యారు. ఈ నేపథ్యంలో ఇసుక పాలసీని సమూలంగా మార్చే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా అయితే స్పష్టం అవుతోంది.

రోబో సాండ్…

రాష్ట్రంలోని వివిధ నదుల నుండి సేకరిస్తున్న ఇసుకలో 70 నుండి 80 శాతం హైదరాబాద్ మహానగారినికే తరలివెల్తున్నట్టుగా గణాంకాలు చెప్తున్నాయి. అయితే కొంతకాలంగా నదుల్లో లభ్యమవుతున్న ఇసుకకు బదులుగా రోబో సాండ్ వినియోగిస్తున్నారు. నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో కొత్తగా నిర్మాణం అవుతున్న భవనాలకు రోబో సాండ్ వినియోగించుకునేందుకు బిల్డర్లు ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్టుగా తెలుస్తోంది. క్రషర్లలో లభ్యం అవుతున్న డస్ట్ ను రోబో సాండ్ గా పిలుస్తున్నారని సమాచారం. ఈ రోబో సాండ్ హైదరాబాద్ నగర శివార్లలోనే లభ్యం అవుతుండడం, రాయల్టీ కూడా ప్రభుత్వానికి నామమాత్రంగానే చెల్లిస్తుండడంతో తమకు ఖర్చులు గణనీయంగా తగ్గుతున్నాయన్న విషయాన్ని గమనించిన బిల్డర్లు రోబో సాండ్ కొనుగోలు చేసేందుకు ఆసక్తి పెంచుకున్నట్టుగా సమాచారం. ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో నిర్మాణం అవుతున్న భవనాల కోసం వాడుతున్న రోబో సాండ్ వినియోగం దాదాపు 40 శాతం వరకు పెరిగినట్టుగా ఓ అంచనా. దీంతో ఇసుకకు కొంతమేర డిమాండ్ తగ్గిందన్న వాదనలు వినిపిస్తున్నారు ఇసుక రీచుల నిర్వాహకులు. అయితే రోబో సాండ్ వినియోగాన్ని కట్టడి చేసినట్టయితే ప్రభుత్వ ఆదాయానికి గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఏడు ఎనిమిదేళ్లుగా రోబో సాండ్ వినియోగం తీవ్రంగా పెరిగినట్టుగా తెలుస్తోంది.

వినియోగంతో…

అయితే రోబో సాండ్ వినియోగించి భవనాలు నిర్మించడం వల్ల నాణ్యతా ప్రమాణాలు ఎంతమేర ఉంటాయి అన్న విషయాలపై కూడా సాంకేతిక నిపుణుల నుండి నివేదికలు తెప్పించుకోవల్సిన అవసరం ఉంది. ఇటీవల హైదరాబాద్ నగరంలోని ఒకటి రెండు చోట్ల రోబో సాండ్ వినియిగించి నిర్మించిన భవనాలు కూలిపోయాయని కూడా చెప్తున్నారు. రోబో సాండ్ యూజ్ చేయడం వల్ల భవనాలు వేడిని ఎక్కవగా ఆకర్షిస్తాయని అంటున్నవారూ లేకపోలేదు. ఈ సాండ్ వినియోగించి నిర్మించే భవనాల్లో నివసించే వారు ఏసీలు, ఫ్యాన్లను ఎక్కువ వినియోగించాల్సి వస్తుందని దీనివల్ల విద్యుత్ ఉత్పత్తిపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే రోబో సాండ్ వినియోగంపై ఎలాంటి నిషేధం విధించనప్పటికీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని దీని వినియోగం వల్ల ఎదురయ్యే సవాళ్లపై కూడా అధ్యయనం చేసిన తరువాతే అయినా ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంటే అన్ని విధాలుగా లాభం అవుతుందని చెప్తున్నారు. మైనింగ్ అధికారులు రోబో సాండ్ విషయంపై ప్రత్యేక దృష్లి సారించి భవన నిర్మాణాల కోసం ఎంతమేర వినయోగించవచ్చో అన్న విషయాలపై తెలుసుకున్నట్టయితే బావుంటుందని ఇసుక రీచుల నిర్వాహాకులు వ్యాఖ్యానిస్తున్నారు.

You cannot copy content of this page