బొమ్మకల్ శ్రీనివాస్ పై రౌడీషీట్…

మార్చిలో ఓపెన్… ఇప్పుడు వైరల్

దిశ దశ, కరీంనగర్:

బొమ్మకల్ సర్పంచ్ పురుమళ్ల శ్రీనివాస్ పై రౌడీ షీట్ ఓపెన్ అయినట్టుగా ఓ లేఖ నెట్టింట వైరల్ అవుతోంది. ఆరు నెలల క్రితం అయిన ఈ లేఖ ఇప్పుడు వైరల్ అవుతుండడం చర్చనీయాంశంగా మారింది. పురుమళ్ల శ్రీనివాస్ పై 24కు పైగా కేసులు నమోదయ్యాయని, ఛీటింగ్, ఫోర్జరీ, పబ్లిక్ సర్వెంట్లపై దాడులు, దురక్రామణలు, భూ దందాలకు సంబంధించిన నేరాల్లో నిందితునిగా ఉన్నాడని ఆ లేఖలో పేర్కొని ఉంది. అయితే ఈ లేఖ మాత్రం గత మార్చి 13నే జారీ కాగా ఇప్పుడు వైరల్ అవుతుండడం గమనార్హం.

రాజీనామా చేసిన తరువాత…

ఈ నెల 15న బీఆర్ఎస్ పార్టీకి బొమ్మకల్ శ్రీనివాస్ రాజీనామా చేసిన ఫోటోలు, లేఖలు 17వ తేదిన లీకయ్యాయి. అంతకు ముందే శ్రీనివాస్ కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం గాంధీభవన్ లో దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ గులాభీకి గుడ్ బై చెప్తారన్న ఊహాగానాలు చాలా రోజుల క్రితమే వచ్చినప్పటికీ ఆయన మాత్రం ఈ నెల 15న రాజీనామా చేశారు. ఇప్పుడు శ్రీనివాస్ పై రౌడీ షీట్ ఓపెన్ అయిన కాపీ నెట్టింట వైరల్ అవుతుండడం చర్చనీయాంశంగా మారింది. ఈ లేఖను కావాలనే శ్రీనివాస్ ప్రత్యర్థులు వైరల్ చేస్తున్నారా లేక వేరే వారు ఎవరైనా షేర్ చేస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో శ్రీనివాస్ పై రౌడీ షీట్ ఉందన్న విషయం ఆ పార్టీ అధిష్టానానికి చేరవేయడంలో భాగంగా లేఖను వైరల్ చేస్తున్నారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా బొమ్మలక్ సర్పంచ్ పురుమళ్ల శ్రీనివాస్ పై రౌడీ షీట్ మార్చిలో ఓపెన్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో హాట్ టాపిక్ గా మారింది.

You cannot copy content of this page