భావోద్వేగ ట్విట్…
దిశ దశ, హైదరాబాద్:
బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీ నుండి వైదొలిగేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన కొద్ది సేపటి క్రితం ‘ఎక్స్’ వేదికగా తన భావోద్వేగాన్ని పంచుకున్నారు. బీఎస్పీ, బీఆర్ఎస్ పొత్తు తరువాత జరుగుతున్న పరిణామాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పొత్తుల ప్రకటన వెలువడినప్పటి నుండి బీజేపీ తమ చారిత్రాత్మక పొత్తును భగ్నం చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోందని, చివరకు కవిత అరెస్ట్ తో సహా అంటూ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు. ‘‘పొత్తు ఒప్పందంలో భాగంగా ఎన్ని ఒడిదొడుకులొచ్చినా ముందుకు సాగాల్సిందే… కష్టసుఖాలు పంచుకోవాల్సిందే…. ఇదే నేను నమ్మిన నిజమైన ధర్మం… బీయస్పీ- బీఆరెస్ పొత్తు వార్త భయటికి వచ్చిన వెంటనే బీజేపీ ఈ చారిత్రాత్మక పొత్తును భగ్నం చేయాలని విశ్వప్రయత్నాలు (కవిత అరెస్టుతో సహా) చేస్తున్నది. బీజేపీ కుట్రలకు భయపడి నేను నమ్ముకున్న విలువలకు తిలోదకాలు ఇవ్వలేను. నా ఈ ప్రస్థానాన్ని ఆపలేను’’ అంటూ ఆర్ఎస్పీ కుండబద్దలు కొట్టారు. స్వైరోగా తాను ఎవరినీ నిందించనని నమ్మిన వారిని కూడా చేయకూడదని, తెలంగాణ భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయించుకోవల్సింది బహుజన సమాజ్ పార్టీయేనని తేల్చిచెప్పారు. తనను విశ్వసించినందుకు మాయావతి, ఎంపీ రామ్ జీ గౌతమ్ లకు ధన్యవాదాలు తెలిపిన ప్రవీణ్ కుమార్… కాన్షీరామ్ స్థాపించిన సామాజిక న్యాయం కోసం మిషన్ ను జీవితాంతం పాటిస్తానన్నారు. బహుజన రాజకీయ ప్రపంచంలో ఈ చిన్న ప్రయాణంలో తనను ఆదరించడంతోపై తనను విశ్వసించినందుకు దేశంలోని బహుజనలందరికి రుణపడి ఉంటానన్నారు.
https://x.com/RSPraveenSwaero/status/1768920677438927071?t=vLKjkaqsgSFYNU6GC1ziPA&s=08