విద్యా భారతి దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి
దిశ దశ, కరీంనగర్:
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రారంభమై 99 సంవత్సరాలు పూర్తి చేసుకొని 100వ సంవత్సరంలోకి అడుగుడుతున్న సందర్భంలో ఆర్ ఎస్ ఎస్ కరీంనగర్ శాఖ పథ సంచలన్ (రూట్ మార్చ్ ) కార్యక్రమాన్ని, విజయదశమి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించింది.
ADVT
కరీంనగర్ జ్యోతి నగర్ లోని సెంట్ ఆల్ఫోన్స్ హైస్కూల్లో జరిగిన విజయదశమి ఉత్సవ కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన విద్యా భారతి దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ… ఆర్ఎస్ఎస్ జన్మ శతాబ్ది లోకి అడుగు పెడుతున్న విశేష శుభ సందర్భమిదన్నారు. మాతృభూమి సేవ కోసం ఉద్భవించిన సంస్థ RSSఅని, గ్లోబల్ స్కోప్ ఉన్న ఏకైక జాతీయవాద సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మాత్రమేనని అన్నారు. దేశం కోసం సమాజం కోసం స్వయం సేవకుల స్వచ్ఛంద త్యాగం, తపస్సు, అంకిత భావం వల్లే ఆర్ఎస్ఎస్ వందేళ్ళ ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగించిందన్నారు. డాక్టర్ జి విజయదశమి రోజున ఆర్ఎస్ఎస్ ను నాగపూర్ లో స్థాపించారని, పదిమంది చిన్నపిల్లలతో ప్రారంభమైన ఆర్ఎస్ఎస్ దేశవ్యాప్తంగా శాఖోపశాఖలుగా విస్తరించి, నేడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించిందన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ క్రమశిక్షణ కలిగిన ఆర్గనైజేషన్ అని, సంఘ కార్య పద్ధతి, విశేషమైన సేవలతోనే ఈ స్థాయికి చేరిందన్నారు. ముఖ్యంగా సంఘ కార్య పద్ధతిలో ప్రధానమైనది మూలమైనది శాఖ అని, దీనిని వికసింప చేయడానికి బైఠక్, అభ్యాసవర్గ, సాంఘిక్ లు తోడ్పడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ ట్రస్టు ట్రస్ట్ బల్మూరి కర్ణాకర్ రావు, ఆర్ఎస్ఎస్ బాధ్యులు డాక్టర్ రమణాచారి, జిల్లా సంఘచాలక్ నిరంజనా చారి, హన్మాండ్ల శ్రీనివాస్ రెడ్డి లతోపాటు పలువురు స్వయం సేవకులు పాల్గొన్నారు.