ఆర్టీసీ బస్సును హైజక్ చేసిన ఘనుడు

దిశ దశ, రాజన్న సిరిసిల్ల:

రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లెల్ల క్రాసింగ్ వద్ద ఆర్టీసీ హైర్ బస్సు ప్రత్యక్ష్యం కావడం కలకలం సృష్టించింది. సిద్దిపేట ఆర్టీసీ బస్ స్టేషన్ లో అదృశ్యం అయిన ఈ బస్సు రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లెల్ల క్రాసింగ్ వద్ద రోడ్డు పక్కన గుంతలోకి దిగింది. బస్సు నడుపుతున్న వ్యక్తిని గమనించిన స్థానికులకు అనుమానం వచ్చి అతని నుండి వివరాలు రాబట్టే ప్రయత్నం చేశారు. చివరకు బస్సు నడుపుకుంటూ వచ్చిన వ్యక్తి డ్రైవర్ కాదని గుర్తించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సిద్దిపేట పోలీసులు బస్సు మిస్సింగ్ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. అయితే సదరు బస్సును దొంగలించిన ప్రబుద్దుడు సిద్దిపేట బస్ స్టేషన్ నుండి వేములవాడకు తీసుకొచ్చి అక్కడ ప్యాసింజర్లను ఎక్కించుకుని తిరుగు ప్రయాణం అవుతుండగా జిల్లెల్ల క్రాసింగ్ వద్ద బస్సు గుంతలోకి జారిపోవడంతో ఆగిపోయింది. బస్సు నడిపిన వ్యక్తిని గమనించి స్థానికులు అసలు ఆయన బస్సు డ్రైవరే కాదని అంటున్నారు. మరో వైపున సారంపల్లి నేరెళ్ల సమీపంలో బస్సులో డిజిల్ అయిపోవడంతో బస్సును నలిపివేశారని మరికొందరు అంటున్నారు. ఏది ఏమైనా ఆర్టీసీ స్టేషన్ నుండి బస్సును దొంగలించుకపోవడం సంచలనంగా మారిందని చెప్పక తప్పదు. అయితే బస్సు హైర్ దే అయినప్పటికీ అందులో డ్యూటీ చేయాల్సిన కండక్టర్ కూడా లేకుండా బస్సును ఎలా తీసుకఎళ్లాడన్నదే అంతు చిక్కకుండా పోయింది.

You cannot copy content of this page