దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ తిరుపతి ట్రైన్ ఇక నుండి వారానికి నాలుగు సార్లు నడిపించేందుకు చర్యలు మొదలయ్యాయి. ఈ ప్రాంతం నుండి తిరుపతి వెంకన్న దర్శనానికి వెల్లే భక్తుల సంఖ్య పెరిగిపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. చాలినన్ని రైళ్లు అందుబాటులో లేకపోవడంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. దీంతో అవసరానికి తగ్గట్టుగా రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్టయితే బావుటుందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ భావించారు. ఈ మేరకు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. దశాబ్దానికి పైగా వారానికి రెండు సార్లు మాత్రమే ట్రైన్ నడుస్తుండడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ రైల్వే మంత్రికి వివరించారు.ఇందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి వారానికి నాలుగు సార్లు కరీంనగర్, తిరుపతి ట్రైన్ నడిపించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని రైల్వే అధికారులను ఆదేశించారు. ఈ విషయాన్ని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. దీంతో పాటు రైల్వే సంబంధిత అంశాలను కూడా పరిశీలించాలని ఎంపీ బండి సంజయ్ కేంద్ర మంత్రిని కోరారు. పెద్దపల్లి, నిజామాబాద్ రైల్వే లైన్ లో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అవసరమున్న చోట రోడ్ అండర్ బ్రిడ్జి డ్రైనేజీలు మంజూరు చేయాలని కోరారు. కరీంనగర్, హసనపర్తి కొత్త రైల్వే పనులకు త్వరితగతిన పూర్తి చేసేందుకు చొరవ చూపాలని అభ్యర్థించారు. జమ్మికుంట స్టేషన్ లో తెలంగాణ, దానాపూర్, నవజీవన్, గోరఖ్ పూర్ ఎక్స్ ప్రెస్ తో పాటు ఇతర రైళ్లను కూడా నిలిపేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కరీంనగర్ జిల్లాలో అతిపెద్ద వాణిజ్య కేంద్రాల్లో ఒకటైన జమ్మికుంట పట్టణానికి దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిని వ్యాపారులు, వినియోగదారులు రాకపోలు సాగిస్తారని ప్రధాన రైళ్లు ఆపినట్టయితే బావుంటుదని సంజయ్ మంత్రికి వివరించారు. ఆయన చేసిన ప్రతిపాదనలన్నింటికి సానుకూలంగా స్పందించిన రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారని బండి సంజయ్ వివరించారు.
https://twitter.com/bandisanjay_bjp/status/1738144726447190405?t=T5UBxVMs70ZcJVFDOqhbxA&s=19