దిశ దశ, స్పోర్ట్స్:
వీరాభిమాని బైక్ పై వెల్తుంటే అతని పక్కనే తన వాహనాన్ని ఆపి షాకిచ్చారు సచిన్ టెండూల్కర్. బైక్ ఆపి వాహనం వైపు చూసిన ఆ అభిమాని సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. గురువారం ‘ఎక్స్’ వేదికగా సచిన్ షేర్ చేసిన ఈ పోస్టు మిలియన్ వ్యూస్ దాటింది. భారత క్రికెట్ లో చరిత్ర సృష్టించిన సచిన్ టెండూల్కర్ అంటే ఇప్పటికీ అభిమానుల ఆనందానికి అవధులు ఉండవేమో. అభిమాని బైక్ ను ఆపగానే అతను కూడా ఆశ్యర్యానికి గురయ్యాడు. ఆ తరువాత సచిన్ ఆటో గ్రాఫ్ కూడా తీసుకున్న అభిమాని ఓ సెల్ఫీ కూడా దిగాడు. తాను నమ్మలేకపోతున్నానంటూ అభిమాని వ్యాఖ్యానించారు.