జర్నలిస్టును ప్రాణాపాయానికి చేర్చిన వైరల్ ఫీవర్…

దిశ దశ, కరీంనగర్:

వైరల్ ఫీవర్ ఓ జర్నలిస్టును ప్రాణాపాయ స్థితికి చేర్చింది. వైరల్ ఇన్ ఫెక్షన్ రక్తంలోకి చేరి కదలలేని పరిస్థితిని తయారు చేసింది. సాదాసీదా జర్నలిస్టుగా జీవనం సాగిస్తున్న ఆయన ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే కావడంతో అతన్ని ఆధుకునేందుకు ముందుకు రావల్సిన అవసరం ఎంతైనా ఉంది. కరీంనగర్ సాక్షి దినపత్రికలో స్పోర్ట్స్ రిపోర్టర్ గా పని చేస్తున్న మహేందర్ దీనావస్థ తెలిసిన ప్రతి ఒక్కరూ చలించిపోక మానరు. అత్యంత దయనీయమైన పరిస్థితిలో కొట్టుమిట్లాడుతున్న మహేందర్  వైరల్ ఫీవర్ బారిన పడగా, వైరల్ ఇన్ ఫెక్షన్ రక్తంలో చేరడంతో అతని కాళ్లు, చేతులు పనిచేయకుండా పోయాయి. మహేందర్ సాధారణ స్థితికి చేరాలంటే రోజుకు రూ. 20 వేల విలువ చేసే ఇంజక్షన్లు ఆరు చొప్పున  నిరంతరంగా రెండు వారాల పాటు ఇవ్వాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని వైద్యులు తెలిపారు. ఒక్క ఇంజక్షన్ల కోసమే రోజుకు రూ. 1.20 లక్షలు అవసరం కాగా ఇతరాత్ర వైద్య పరీక్షలు, చికిత్స కోసం మొత్తం రూ. 30 లక్షల వరకు ఖర్చు అవుతుందని కూడా తెలిపారు. సగటు జీవితం గడుపుతున్న మహేందర్ కుటుంబం  అతనికి చికిత్స చేయించేంత స్తోమత లేదు. దీంతో స్పోర్ట్స్ రిపోర్టర్ మహేందర్ ను ఆదుకునేందుకు సమాజం తమవంతుగా బాసటగా నిలవాల్సిన అవసరం ఉంది. ప్రజా ప్రతినిధులు, క్రీడా సంఘాలతో పాటు సహచర జర్నలిస్టులు, వివిధ రంగాల్లో ఉన్న వారు తమవంతు చేయూతనివ్వాలని అభ్యర్థిస్తున్నారు. తమకు తోచిన విధంగా మహేందర్ ను ఆదుకునేందుకు ఫోన్ పే నెంబ‌రు 8688117162కు తమ వంతు ఆర్థిక సాయం అందించాలని కోరుతున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో అతని శ్రేయస్సు కోరుతున్న వారు వైరల్ చేస్తున్నందున ప్రతి ఒక్కరూ తమవంతుగా బాసటగా నిలవాల్సిన అవసరం ఉంది. 

You cannot copy content of this page