ఐస్ క్రీమ్ విత్ విస్కీ…

దిశ దశ, హైదరాబాద్:

హై క్లాస్ ఏరియాలో చీప్ ట్రిక్స్ ప్లే చేస్తున్న ఐస్ క్రీమ్ పార్లర్ గుట్టును రట్టు చేశారు ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు. చిన్నారులను, యువతను ఆకర్షించి సొమ్ము చేసుకోవాలనుకున్న వారి బండారాన్ని బట్టబయలు చేశారు. హైదరాబాద్ నగరంలోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 1, 5లో హరికే కేఫ్ ఐస్ క్రీమ్ పార్లర్ షాపులో తయారు చేస్తున్న ఐస్ క్రీముల్లో విస్కీ కలపి విక్రయించడం మొదలు పెట్టారు నిర్వాహకులు. ఒక కిలో ఐస్ క్రీమ్ లో 60 ఎంఎల్ 100 పైపర్స్ విస్కి కలిపి ఐస్ క్రీమ్స్ తయారు చేసి విక్రయిస్తున్నారు. ఈ పార్లర్ లో ఐస్ క్రీమ్ కొనుగోలు చేసిన వారు ఇక్కడకే వచ్చి తినేందుకు ఆసక్తి చూపుతున్నారు. తమ వ్యాపారాన్ని మరింత వృద్ది చేసుకునేందుకు సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ సూపరింటిండెంట్ ప్రదీప్ రావు నేతృత్వంలోని బృందం దాడులు చేశారు. ఈ పార్లర్ లో విస్కీ మిక్స్ చేసి తయారు చేసిన ఐస్ క్రీమ్ పీసులు 23, 11.5 కేజీల విస్కీ ఐస్ క్రీమ్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ పార్లర్ ను శరత్ చంద్రారెడ్డి నిర్వహిస్తుండగా, దయాకర్ రెడ్డి, శోభన్ రెడ్డిలు తయారు చేస్తున్నారని గుర్తించారు. ఈ దాడుల్లో ఎస్సై బలరాం, అరుణ్, మౌనిక, ప్రసన్న, యాదగిరిలు పాల్గొన్నారు.

You cannot copy content of this page