సమంత ఆరోగ్యంలో ఊహించని మార్పులు వస్తున్నాయి. రెండు మూడు నెలల కింద ఉన్న సామ్ కు ఇప్పుడు మనం చూస్తున్న సామ్ కు వ్యత్యాసం కనీసం మనకు ఊహించని స్థాయిలో ఉంది. ఆ మధ్య నడవటానికి, కూర్చోడానికి కుడా ఇబ్బంది పడిన సమంత ఇప్పుడు ఏకంగా బరువులు ఎలా ఎత్తేస్తుంది. ఈమె ఆరోగ్యం పూర్తిగా కుదుట పడినట్లేనా !
సమంత ఆరోగ్యం గురించి కొన్ని నెలలుగా సొషల్ మీడియాలో చా వార్తలు వైరల్ అయ్యాయి. ఈ కారణంగానే ఈమె 6 నెలలుగా సినిమలకు దూరం అయ్యారు. మరీ ముఖ్యంగా యషొద రిలీజ్ టైమ్ సమంతను చూసి అభిమానులు చాలా అంటే చాలా కంగారు పడ్డారు. అసలు ఈమె మళ్లీ సినిమాలు చేస్తారా,ఆరోగ్యం పూర్తిగా కుదుట పడుతుందా లేదా అనే భయాలు కూడా మొదలయ్యాయి . కానీ ఇప్పుడు చాలా ఎనర్జీగా ఉంది.
ప్రస్తుతం సమంత వెబ్ సిరీస్లో నటిస్తుంది. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న ఈ సిరీస్ను ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్ రాజ్ టికే తెరకెక్కిస్తున్నారు. ఈ సిరీస్లో యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉండబోతున్నాయి. దానికి తగ్గట్టుగానే జిమ్లో వర్కౌట్ మోదలు పెట్టారు సమంత. ప్రస్తుతం ఈమెను చూస్తూంటే వారియర్ లా కనిపిస్తున్నారు. 2 నెలల కింద వాటర్ బాటిల్ ఐనా ఎత్తగలరా అని అనుమానులు వచ్చాయి. ఇప్పుడు వందల కేజీల బరువులు అలవోకగా ఎతేస్తున్నరు సమంత. ఇదంతా చూస్తూంటే సమంత హెల్త్ తక్కువ టైమ్ లోనే ఊహించని విధంగా మారిందని అర్ధం అవుతుంది.