ట్విన్స్ సిస్టర్స్ స్పెషాలిటీ…

కేసీఆర్ కిట్ ఇచ్చిన ఎమ్మెల్యే ‘పెద్ది’

వారిద్దరూ ఒకేసారి జన్మించారు. ట్విన్స్ అయిన ఆ అక్కాచెల్లెల్లిద్దరూ కలిసి పెద్దవారయ్యారు. ఒకే టైంలో పుట్టిన ఈ ట్విన్స్ సిస్టర్స్ కు ఏక కాలంలో వివాహం చేస్తే బావుంటుందిగా అని అనుకున్నారు ఇంటి పెద్దలు. అనుకున్నదే తడవుగా అలాగే పెళ్లి చేశారు పేరెంట్స్. తల్లి గర్భం నుండి ఒకేసారి పురుడు పోసుకున్న వీరిద్దరూ ఒకే టైంకు డెలివరి అయి అందరినీ ఆశ్యర్యపరుస్తున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట సమీపంలోని దుగ్గొండి మండలం తిమ్మంపేటకు చెందిన ఈ ఇద్దరు అక్కా చెల్లెల్ల గురించి వింటుంటే ఇదేదో కథలా ఉందే అనుకుంటున్నారు కదు… కానీ కళ్లముందే సాక్షాత్కరించిన వాస్తవం. విచిత్రంగా సాగుతున్న ఈ అక్కాచెల్లెల్ల జీవన విధానం గురించి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఒకేసారి పుట్టిన ఈ బిడ్డలు ఇప్పటికీ ఒకే విధమైన చర్యలతో జీవనం సాగిస్తున్నారన్న విషయంపై తెలిసిన ప్రతి ఒక్కరూ అబ్బురపడిపోతున్నారు. తిమ్మంపేట గ్రామానికి చెందిన బొంత సారయ్య-కొమరమ్మ లకు కవలలు జన్మించగా వీరికి లలిత-రమ అని నామకరణం చేశారు తల్లిదండ్రులు. ఏడాది క్రితం ఒకే వేదికపై వీరిద్దరి వివాహాన్ని అత్యంత గ్రాండ్ గా నిర్వహించారు పుట్టింటి వారు. ఈ సిస్టర్స్ ఇద్దరూ కూడా గురువారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకే సమయంలో డెలివరీ కాగా ఇద్దరు కూడా మగ బిడ్డలకు జన్మనిచ్చారు. ఒకే సమయంలో పుట్టిన బిడ్డలిద్దరు కూడా ఒకేసారి డెలివరీ కావడం అందునా ఇద్దరూ మగ బిడ్డలను కనడం కూడా వారి జీవితాల్లో వైవిద్యత చోటు చేసుకుందనే చెప్పాలి.

ఇదీ వెరైటీయే…

వీరిద్దరి జీవితాల్లో మరో స్పెషాలిటీ చోటు చేసుకుంది. లలిత, రమల వివాహ సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కళ్యాణ లక్ష్మీ స్కీంను నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అందజేశారు. వీరిద్దరు కూడా ఒకే సారి డెలివరీ అయ్యారన్న విషయం తెలుసుకున్న ఆయన శుక్రవారం ఆసుపత్రికి వెళ్లి ఇద్దరు అక్కాచెల్లెల్లెకు కేసీఆర్ కిట్స్ అందజేశారు.

You cannot copy content of this page