ఇసుక లారీలను నిలిపేయండి… మానకొండూరులో ఆందోళన

దిశ దశ, మానకొండూరు:

మానకొండూరు మండలంలో మళ్లీ ఇసుక లారీలపై స్థానికులు యుద్దం ప్రకటించారు. మూడు రోజులుగా ఇసుక లారీలను కట్టడి చేయాలంటూ ఆందోళన బాట పట్టారు. మండలంలోని ఊటూరు, పచ్చునూరు గ్రామాల సమీపంలో ఇసుక లారీలను అడ్డుకున్న స్థానికులు తాము తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిమితికి మించి ఇసుక రవాణా చేస్తునర్నారని, రాత్రి వేళల్లో కూడా లారీల రాకపోకలతో ఇబ్బంది పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. లారీలు ఇష్టారీతిన నడుపుతుండడంతో ఎటు వైపు నుండి ప్రమాదం ముంచుకొస్తుందోనన్న భయంతో కాలం వెల్లదీస్తున్నామని అంటున్నారు. ఓవర్ లోడ్ వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఆధాయానికి గండిపడడమే కాకుండా రోడ్లు దెబ్బతింటున్నాయని కూడా స్థానికులు అంటున్నారు. నిరంతరం ఇసుక రవాణా వల్ల జరుగుతున్న ఇబ్బందులను గమనించి పరిష్కారం చూపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సోమవారం నుండి మూడు రోజుల పాటు ఇసుక లారీలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.

అధికార పార్టీ..?

సాధారణంగా ఇసుక లారీలను అడ్డుకునేందుకు ప్రతిపక్ష పార్టీల నాయకులు సాహసిస్తుంటారు. కానీ మానకొండూరు మండలంలోని ఇసుక రవాణా విషయంలో స్థానికులతో పాటు అధికార పార్టీ నాయకులు కూడా అడ్డుకుంటున్నారని సమాచారం. కాంగ్రెస్ పార్టీ నాయకుల జోక్యం గురించి ఇఫ్పటికే నిఘా వర్గాలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపినట్టుగా తెలుస్తోంది. ఇసుక రవాణా జరుగుతున్న తీరుపై కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానికులతో చేతులు కలిపడం చర్చనీయంశంగా మారింది.

You cannot copy content of this page