సానియా మీర్జా రిటైర్మెంట్​

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుండి రాకెట్ తో కోర్టులోకి దిగేది లేదని అప్పటి నుండి తన ఆటకు స్వస్తి పలుకుతున్నానని ప్రకటించింది. ట్విట్టర్​లో తన రిటైర్మెంట్‌ను ప్రకటించిన సానియా ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్, దుబాయ్ ఓపెన్ తర్వాత టెన్నిస్‌కు వీడ్కోలు పలకనున్నట్టు వెల్లడించింది. ఈ రెండు టోర్నీలు తనకు చివరివని కూడా వెల్లడించింది. ఈ మేరకు రిటైర్మెంట్​పై ఉద్వేగభరితమైన మూడు పేజీల నోట్ ను కూడా ట్విట్టర్ కు అటాచ్ చేసింది. ఆరేళ్ల వయసులో తాను టెన్నిస్ కోర్టులో అడుగు పెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన ప్రధాన అంశాలను పీడీఎఫ్ లో వివరించింది సానియా. హైదరాబాద్ స్టార్ సానియా మీర్జా దేశం తరుపున ఆడి పలు పథకాలను సాధించింది. పాకిస్తాన్ క్రికెటర్ ను పెళ్లి చేసుకున్న సానియా తాజాగా రిటైర్మెంట్ ప్రకటించడం విశేషం.

You cannot copy content of this page