నోట్ల దండతో సమితి ఆఫీసు ముందు నిరసన
చివరకు కరెన్సీని ఆఫీసు ముందు విసిరేసిన వైనం
దిశ దశ, దండకారణ్యం:
మహారాష్ట్రలోని సాంభాజీనగర్ జిల్లాలో ఓ సర్పంచ్ హంగామా సృష్టించాడు. అధికారుల అవినీతిని ఏకి పారేస్తూ వినూత్న నిరసన చేపట్టాడు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియో గురించి హాట్ టాపిక్ అవుతోంది. గ్రామంలో చేపట్టాల్సిన పని గురించి లంచం అడిగారని సర్పంచ్ చేపట్టిన డిఫరెంట్ స్టైల్ ఆందోళనపై మహారాష్ట్ర అంతటా చర్చ జరుగుతోంది. శుక్రవారం జరిగినట్టుగా తెలుస్తున్న ఈ వీడియోలో అధికారులపై సర్పంచ్ ఆగ్రహం కూడా వ్యక్తం చేశాడు. మహా ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండ్, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ల పేర్లు ఊటంకిస్తూ అవినీతి అధికారుల తీరుపై మండిపడ్డారు. తన గ్రామంలో బావి నిర్మాణం చేపట్టాలంటే తనను మామూళ్లు ఇవ్వాలని పంచాయితీ సమితి (బ్లాక్ డెవలప్ మెంట్) (BDO) కార్యాలయానికి సంబంధించిన అధికార్లు అడిగారని ఆరోపించారు. తన వాహనంలో సమితి కార్యాలయ ఆవరణకు చేరుకున్న సర్పంచ్ మెడలో నోట్ల కట్టల దండ వేసుకుని కార్యాలయ ప్రధాన ద్వారం ముందు నిలబడి అవినీతి అధికారుల తీరును ఏకి పారేశారు. అనంతరం తన మెడలోని దండకు ఉన్న నోట్లను గాల్లోకి విసిరేస్తూ తన నిరసన తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సర్పంచ్ తీరుపై మహారాష్ట్ర మీడియాలో హైలెట్ న్యూస్ అయిపోయింది. ఎలక్ట్రానికి మీడియాలో సర్పంచ్ వార్తకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు.