గ్రామంలో అర్హులందరికీ ఇవ్వాలని డిమాండ్
దిశ దశ, హుజురాబాద్:
హుజురాబాద్ నియోజకవర్గంలో మరో అధికార పార్టీ సర్పంచ్ నిరసనలకు దిగారు. తన గ్రామంలో అర్హులైన ప్రతి ఒక్కరికి దళిత బంధు స్కీం ద్వారా ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేస్తూ ఏకంగా ఎంపీడీఓ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. సొంత పార్టీకి చెందిన సర్పంచ్ ఆందోళన చేయడం స్థానికంగా సంచలనం అయింది. వివరాల్లోకి వెల్తే… హుజురాబాద్ సమీపంలోని ఇందిరానగర్, శాలపల్లి గ్రామంలోని అర్హులైన వారందరికి దళిత బంధు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సర్పంచ్ శారద- ప్రవీణ్ లు స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. హుజురాబాద్ ను పైలెట్ ప్రాజెక్టుకు ఎంపిక చేసుకున్నందున అందరికీ ఈ స్కీం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ స్కీం అమలు చేసే విషయంలో ఆంక్షలు పెట్టకుండా దళితులందరికీ వర్తించేలా చర్యలు తీసుకోవాలన్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచ్ దళిత బంధు స్కీం కోసం నిరసన వ్యక్తం చేయడం కలకలం సృష్టించింది.