మహిళా సర్పంచ్ స్వీయ నిర్భందం

అక్రమ ఇసుక రవాణాపై ఆగ్రహం

దిశ దశ, కరీంనగర్:

అక్రమ ఇసుక రవాణాతో జరిగే అనర్థాలను గుర్తించిన ఓ మహిళా సర్పంచ్ స్వీయ నిర్భందం అయ్యారు. నిత్యం యథేచ్ఛగా సాతున్న ఇసుక అక్రమ రవాణాను కట్టడి చేయాలంటూ ఆమె డిమాండ్ చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వన్నారం గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ లక్ష్మి స్వీయం నిర్భందం చేసుకున్నారు. గ్రామంలో ఇసుక అక్రమ రవాణా సాగుతుండడంతో భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో పాటు ఇతరాత్ర సమస్యలు ఎదురవుతున్నాయని సర్పంచ్ లక్ష్మీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై ఇప్పటికే అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, అక్రమ ఇసుకను కట్టడి చేయడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వన్నారంలో శుక్రవారం గ్రామ సభ నిర్వహించాల్సిన నేపథ్యంలో సర్పంచ్ కార్యాలయంలోకి వెల్లి తలుపులు వేసుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు.

వన్నారం పంచాయతీ కార్యాలయంలో స్వీయ నిర్భందంలో సర్పంచ్ లక్ష్మీ

You cannot copy content of this page