ఇంఛార్జీ కార్యదర్శి మాకొద్దంటున్న సర్పంచ్
దిశ దశ, వీణవంక:
తమను రెగ్యూలరైజ్ చేయాలన్న డిమాండ్ తో పంచాయితీ జూనియర్ సెక్రటరీల సమ్మెకు సర్పంచులు కూడా సంఘీభావం తెలుపుతున్నారు. కార్యదర్శుల సమ్మెతో పంచాయతీల్లో సేవలు నిలిచిపోయతాయని ఇంఛార్జీలను పంపించే పనిలో అధికారులు నిమగ్నం అవుతుంటే సర్పంచులు మాత్రం వీరు మాకవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. తాజాగా కరీంనగర్ జిల్లా వీణవంక మండలం మల్లారెడ్డిపల్లి పంచాయితీకి వచ్చిన ఇంఛార్జీ కార్యదర్శి తమకు అవసరం లేదని సర్పంచ్ జీపీ ఆఫీసుకు తాళం వేశారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ ఎల్లారెడ్డి మాట్లాడుతూ… జూనియర్ సెక్రటరీలను సర్కారు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. వారిని వెంటనే రెగ్యూలరైజ్ చేయాలని లేనట్టయితే తాము కూడా వారితో కలిసి సమ్మెలో భాగస్వాములం అవుతామని సర్పంచ్ స్పష్టం చేశారు. సిబ్బందికి ఆరు నెలలుగా జీతాలు లేవని వెంటనే వారి వేతనాలకు సంబంధించిన నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తొలిసారి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు అన్నింటా చేయూతనిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి మాత్రం జీతాలు కూడా ఇవ్వకపోవడం దారుణమని సర్పంచ్ ఎల్లారెడ్డి వ్యాఖ్యానించారు. పంచాయితీ కార్యదర్శులు కూడా సమ్మె బాటలో పయనిస్తే గ్రామాల్లో చెత్తా చెదారం పేరుకపోయి ప్రజలు అనారోగ్యం బారిన పడే అవకాశాం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
Disha Dasha
1884 posts
Prev Post
Next Post