ఐపీఎస్ ఆఫీసర్ రంగనాథ్
దిశ దశ, వరంగల్:
బలవంతుల నుండి బలహీనులను కాపాడాల్సిన బాధ్యత పోలీసులు, లా అండ్ ఆర్డర్ పై ఉందని వరంగల్ తాజా మాజీ సీపీ రంగనాథ్ అన్నారు. శుక్రవారం వరంగల్ మీడియా ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… అన్యాయం జరిగితే న్యాయంగా కాపాడాల్సిన బాధ్యత తమపైనే ఉంటుందన్నారు. చిన్ననాడు చూసిన మా భూమి సినిమాలో చూసిన భూ సమస్యలను వరంగల్ లో ప్రాక్టికల్ గా చూశానన్నారు. భూ సమస్యలు ఎదురుకావడం బాధకరమని ఇలాంటి వాటిని ఎమెషనల్ గా చూడాల్సిన అవసరం ఉందని లేనట్టయితే చనిపోయే ప్రమాదం కూడా ఉంటుందన్నారు. తప్పు చేస్తే కొంతమేర చర్యలు తీసుకుంటే బావుంటుంది కానీ పవర్ ఉందని చేస్తే ఇబ్బందులు ఎదురుకాక తప్పదని, తప్పులు చేసే వారికి చెక్ పెట్టాలని లేనట్టయితే ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుందన్నారు. ఇక్కడి అధికార యంత్రాంగం, రాజకీయ నాయకులు తనకు అండగా నిలిచారని, మర్డర్ కేసులో తప్పు చేయని వారికి శిక్ష పడడం మంచిది కాదని రంగనాథ్ అభిప్రాయపడ్డారు. ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ అధికారులతో ఫోన్లలో మాట్లాడిన సందర్బాలు ఉన్నాయన్నారు. వరంగల్ లో పని చేయడం చాలా సంతోషంగా ఉందన్న ఆయన వరంగల్ మీడియాకు కితాబిచ్చారు. వరంగల్ ప్రజలు, మీడియాతో కలిసిపోయానని, తనకు ఇక్కడి మీడియా సపోర్ట్ ఉందన్నారు. తాను ఎక్కువగా ఎవరితోనే ఇంట్రాక్ట్ కాలేకపోయానని హైదరాబాద్ వస్తే తనను కలవవచ్చని అన్నారు. న్యాయంగా ఉన్న సమస్య ఎదురైతే తనను కలవవచ్చని తనవంతు సహకారం అందిస్తానన్నారు. మళ్లీ అవకాశం వస్తే వరంగల్ కు రావాలని ఉందని తన మనసులోని మాట వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఇంఛార్జి పోలీస్ కమిషనర్ మురళీధర్, హన్మకొండ ఏసీపీ కిరణ్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు, కార్యదర్శి సదయ్య, ట్రెజరర్ బొల్ల అమర్, వివిధ జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు బీఆర్ లెనిన్, దాసరి కృష్ణ రెడ్డి, మధులు పాల్గొన్నారు.