రేపు యథా విధిగానే స్కూళ్లు…

చంద్రయాన్ లైవ్ టెలికాస్ట్ పాఠశాలల్లో వద్దు…

దిశ దశ, హైదరాబాద్:

చంద్రయాన్ 3 లైవ్ టెలికాస్ట్ స్కూళ్లలో చూపించాల్సిన అవసరం లేదని విద్యాశాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం కూడా రోజు వారిగానే యథావిధిగా 4.45 గంటలకు క్లోజింగ్ టైంగా పాటించాలని, విద్యార్థులు చంద్రయాన్ 3 ల్యాండింగ్ టెలికాస్ట్ ను ఇండ్లలోనే చూసే విధంగా సూచనలు జారీ చేయాలని విద్యాశాఖ డీఈఓ, ప్రిన్సిపల్లను కోరింది. ఒకవేళ ఇండ్లలో చంద్రయాన్ ల్యాండింగ్ చూడలేని వారికి గురువారం పాఠశాలల్లో చూపించాలని సూచించింది. మొదట అన్ని పాఠశాలల్లోె లైవ్ టెలికాస్ట్ చూపించే విధంగా ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చిన విద్యాశాఖ అనూహ్యంగా తన నిర్ణయాన్ని మార్చుకోవడం గమనార్హం.

You cannot copy content of this page