కొనసాగతున్న సీఐడీ సోదాలు…

మాజీ మంత్రి నారాయణ బందువుల ఇళ్లలొ కొనసాగుతున్న వైనం

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి నారాయణ బంధువుల ఇళ్లల్లో ఏపీ సీఐడీల సోదాలు రెండో రోజూ కొనసాగుతున్నాయి. ఆయన రెండో కుమార్తె శరణి ఇంట్లో ఏపీ సీఐడీ సోదాలు నిర్వహించారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అమరావతిని రాజధానిగా ప్రకటించడంతో ఆ ప్రాంతంలో నారాయణ భూములు అక్రమంగా కొనుగోలు చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులోనే ఆయన కుమార్తె ఇంట్లో శుక్ర, శనివారాల్లో సీఐడీ సోదాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌​లోని కూకట్‌పల్లి, కొండాపూర్​, గచ్చిబౌలిలోని పలువురి ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి.

గతంలో నెల్లూరులోని టీడీపీ సీనియర్​ నే నారాయణ ఇంట్లో సైతం అమరావతిలో అసైన్డ్​ భూములు కొనుగోళ్లు, అమ్మకాలకు సంబంధించిన సీఐడీ సోదాలు నిర్వహించింది. గేటు వేసి మరీ ఎవరినీ లోపలికి రానీవ్వకుండా తనిఖీలు చేయడం అప్పట్లో ఎన్నో అనుమానాలకు దారితీసింది. అమరావతిలో అసైన్డ్​ భూములు కొనుగోళ్లు అమ్మకాలకు సంబంధించి మూడేళ్ల క్రితమే సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో అప్పట్లో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు నోటీసులు ఇచ్చింది.

రాజధాని అసైన్డ్​ భూముల వ్యవహారంలో సీఐడీ అధికారులు గతంలో ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. అమరావతిలో 1,100 ఎకరాల అసైన్డ్​ భూములలో అక్రమాలు జరిగాయని సీఐడీ అభియోగం మోపింది. అదే ప్రాంతంలోని వేర్వేరు గ్రామాల్లో 89.9 ఎకరాల అసైన్డ్​ భూములను కొన్నారని పేర్కొంది. ఇలా వేర్వేరు సర్వే నంబర్లలోని అసైన్డ్​ భూములు మాజీ మంత్రి నారాయణ, ఆయన బంధువులు, తెలిసిన వారి పేర్లతో కొనుగోలు చేశారని ఆరోపించారు. వీరందరిపై రాజధాని ప్రాంతంలో ఉన్న సీఐడీ స్టేషన్‌​లో ఐపీసీలోని వివిధ సెక్షన్ల, అవినీతి నిరోధక చట్టం సెక్షన్​ కింద కేసులు నమోదు చేశారు.

You cannot copy content of this page