రెండో రోజూ కొనసాగనున్న సెర్చింగ్ ఆపరేషన్… కరీంనగర్ లోనే ముంబాయి పోలీసులు

దిశ దశ, కరీంనగర్:

ముంబాయి పోలీసుల సెర్చింగ్ ఆపరేషన్ కరీంనగర్ లో రెండో రోజు కూడా కొనసాగనున్నట్టుగా తెలుస్తోంది. గురువారం మద్యాహ్నం నగరానికి చేరుకున్న ముంబాయి పోలీసులు పలు చోట్ల సోదాలు జరిపి ముగ్గురిని అదుపులోకి తీసుకుని త్రీ టౌన్ కు తరలించారు. వీరిలో ఇద్దరిని వదిలేయగా ఒకరిని మాత్రం అదుపులోనే ఉంచుకున్నారు.

కేసు పూర్వా పరాలివే…

మహారాష్ట్రలోని ముంబాయి నగరానికి చెందిన సైబర్ సెల్ క్రైైం బ్రాంచ్ పోలీసులు ఓ కేసు నమోదు చేశారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముంబాయిలోని ఈస్ట్ రీజియన్ సైబర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ కేసు నమోదు అయింది. ఎఫ్ఐఆర్ నంబర్ 33/2024 సెక్షన్ 420, 465, 120(B) ఐపీసీ r/w 66 (D) ఇనఫర్మేషన్ అండ్ టెక్నాలజీ యాక్టు కింద కేసు నమోదు చేశారు. మందాని ఇంపాడ్ పూర్ వెల్ఫేర్ ట్రస్ట్ పేరిట కరీంనగర్ లోని ఓ బ్యాంకులో ఖాతా ప్రారంభించారు. ఏడుగురు సభ్యులు ఒకే ఖాతాను తెరిచిన వీరు ఆర్థిక లావాదేవీలు జరిపినట్టుగా తెలుస్తోంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ముంబాయి సైబర్ క్రైం పోలీసులు కరీంనగర్ చేరుకుని ముగ్గురుని అదుపులోకి తీసుకుని విచారించగా సుభాష్ నగర్ కు చెందిన ఫరూక్ అహ్మద్ (40) అనే వ్యక్తిని కస్టడీలో పెట్టుకున్నారు. మిగతా ఇద్దరిని వదిలేసిన సైబర్ సెల్ పోలీసులు మిగతా వారి కోసం గాలిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఓ మహిళ కూడా ఉన్నట్టుగా పోలీసు వర్గాల సమాచారం. మిగతా వారి కోసం శుక్రవారం కూడా సెర్చింగ్ ఆపరేషన్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే వీరు అకౌంట్ ఓపెన్ చేసిన బ్యాంకు నుండి కూడా పూర్తి వివరాలను రాబట్టే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. 

You cannot copy content of this page