కాన్ఫిడెంట్… TO కాన్ఫిడెన్షియల్… పెద్దపల్లిలో అసలే జరుగుతోంది..?

దిశ దశ, పెద్దపల్లి:

పోలింగ్ తేది సమీపిస్తున్నా కొద్ది ఆ నియోజకవర్గంలో సమీకరణాలు మారుతున్నాయా..? గెలుపు ధీమాలో ఉన్న ఆ పార్టీ రహస్య సర్వేలకు ఎందుకు శ్రీకారం చుట్టింది..? ఇప్పుడిదే టాపిక్ పై ప్రధాన చర్చ సాగుతోందక్కడ.

బలం… బలగం ఉన్నా…

పెద్దపల్లి నియోజకవర్గంలోని ఏడు సెగ్మెంట్లలోనూ ఆధిపత్యం ప్రధర్శిస్తున్న కాంగ్రెస్ పార్టీ వేస్తున్న ఎత్తులు అంతు చిక్కకుండా పోయింది. నియోజకవర్గ ఇంఛార్జిగా చరిష్మా ఉన్న నేత శ్రీధర్ బాబు ఉండడంతో పాటు క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం కూడా విస్తృత స్థాయిలో చేస్తోంది. ఇక్కడి నుండి పోటీ చేస్తున్న వివేక్ తనయుడు గడ్డం వంశీ కృష్ణ గెలుపు నల్లేరు మీద నడకేనన్న ధీమా వ్యక్తం అయింది. ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే కాకుండా ఇతర పార్టీల నాయకులు కూడా పెద్దపల్లి నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నట్టేనన్న అభిప్రాయానికి వచ్చారు. దీంతో ఇక్కడ వార్ వన్ సైడే అన్నట్టుగా ఉందన్న బలమైన ప్రచారానికి తగ్గట్టుగా కాంగ్రెస్ పార్టీ నేతల్లో నమ్మకం బలహీన పడుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అన్ని రకాల హంగులు అందుబాటులో ఉన్నప్పటికి… అస్త్ర శస్త్రాలు తమ చేతిలో ఉన్నప్పటికీ పోలింగ్ సమీపిస్తున్న వేళ ఆ పార్టీ ముఖ్య నాయకుని అనూహ్యమైన నిర్ణయం సంచలనంగా మారింది. అటు పార్టీ శ్రేణుల్లో… ఇటు కామన్ పబ్లిక్ లోనూ పెద్దపల్లిలో అసలేం జరుగుతోంది అన్న చర్చే సాగుతోంది.

సర్వే టీమ్స్…

అన్ని రకాలుగా సన్నద్దమై గెలవడం పక్కా అనుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నాయకులు సర్వే టీమ్స్ ను ఎందుకు రంగంలోకి దింపారనన్నదే మిస్టరీగా మారింది. పబ్లిక్ పల్స్ తెలుసుకునేందుకు రహస్య సర్వే చేయిస్తుండడానికి కారణం ఏంటన్నదే అంతుచిక్కకుండా పోయింది. బలమైన నాయకత్వానికి తోడు ఓటు బ్యాంకు కూడా భద్రంగా ఉందన్న నమ్మకంలో ఉన్న సమయంలో ఆ ముఖ్య నాయకుడు సడెన్ గా సీక్రెట్ సర్వే టీమ్స్ ను రంగంలోకి దింపడం వెనక మూలం ఏంటోనన్న చర్చ సాగుతోంది. నియోజకవర్గంలోని ఏడు సెగ్మెంట్లలో కూడా ఈ సర్వే బృందాలు వివిధ రకాల ప్రశ్నలు సంధిస్తూ వాస్తవికతను తెలుసుకుని అందుకు అనుగుణంగా సమీకరణాలు చేయాలన్న యోచనలో ఉన్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ కారణ:గానే పోలింగుకు ఐదారు రోజుల ముందు సర్వే టీమ్స్ ను పంపించినట్టుగా ప్రచారం జరుగుతోంది.

You cannot copy content of this page