కరీంనగర్ లో 144 సెక్షన్ అమలు

కొద్ది సేపట్లో విడుదల కానున్న ‘బండి’

దిశ దశ, కరీంనగర్:

మరికొన్ని గంట్లలో కరీంనగర్ జిల్లా జైలు నుండి కరీంనగర్ ఎంపీ, బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ బెయిలుపై విడుదల కానున్న నేపథ్యంలో కరీంనగర్ సీపీ సుబ్బారాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరీంనగర్ లో ఏకంగా 144 సెక్షన్ విధిస్తున్నట్టు సీపీ ప్రకటించడం సరికొత్త చర్చకు దారి తీసింది. శుక్రవారం ఉదయం 6 గంటల నుండి జిల్లా జైలు పరిసర ప్రాంతాలు, గ్రేవ్ యార్డ్, ఐబీ చౌరస్తా, వెంకటేశ్వర స్వామి ఆలయం తదితర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఆయా ప్రాంతాల్లో గుంపులు గుంపులుగా జనం ఉండకూడదని, ఎలాంటి ఊరేగింపులు కానీ సభలు, సమావేశాలు నిర్వహించడం కానీ చేయకూడదన్నారు. ఆయా ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉన్నందున చుట్టు పక్కల ఉన్న ఏరియాల మీదుగా ట్రాఫిక్ మళ్లింపు చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.

మోహరించిన బలగాలు…

కరీంనగర్ సీపీ సుబ్బరాయుడు ప్రకటించిన కొద్ది సేపట్లోనే 144 సెక్షన్ అమల్లో ఉన్న ప్రాంతాల్లోకి పోలీసు బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. జిల్లా జైలుకు వెల్లే మార్గంలో రోడ్డు స్టాపర్లను ఏర్పాటు చేయడంతో పాటు ఫారెస్ట్ ఆఫీస్, మార్కెట్ రోడ్, వెంకటేశ్వర స్వామి టెంపుల్, గ్రేవ్ యార్డ్, ఐబీ చౌరాస్తా ప్రాంతాల్లో పోలీసులు భారీగా బందోబస్తు చర్యలు చేపట్టారు.

కరీంనగర్ జిల్లా జైలు మార్గంలో…
జిల్లా జైలు దారిలో మోహరించిన పోలీసులు

You cannot copy content of this page