మళ్లీ గెలిస్తే ఆ పనులు చేస్తా: జానారెడ్డి
రాష్ట్నంలో సీనియర్ పొలిటిషయన్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు కుందూరు జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను స్వర్గానికి వెల్తానని మళ్లీ గెలిపిస్తే ఆ పనులు పూర్తి చేస్తానంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం తుమ్మడం గ్రామంలో గురువారం హాథ్ సే హాథ్ జోడో యాత్ర జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి జానారెడ్డి మాట్లాడుతూ… సార్లు ప్రజలు నన్ను ఏడు గెలిపించారని, మూడు సార్లు ఓడిపోయిన అది ప్రజల కారణంగా ఓడిపోలేదన్నారు. ఈ ప్రభుత్వం పోలీసు ఫోర్స్, డబ్బుతో ఓడించిందే తప్ప తనను ప్రజలు మాత్రం తనను ఓడించలేదని వ్యాఖ్యానించారు. మంత్రిగా ఉన్నప్పుడు 30 వేల ఎకరాలకు సాగు నీరందించడం, 2014 నాటికి సాగర్ నియోజకవర్గం అంతా బీటీ రోడ్లు వేయించడం, 250 గ్రామాలకు విద్యుత్ సరఫరా కల్పించిన ఘనత తనకే దక్కుతుందని జానారెడ్డి వ్యాఖ్యానించారు. స్వయం సహాయక సంఘాల వడ్డీ రూ. 5 వేల కోట్లు తప వద్దే అట్టిపెట్టుకున్న నాయకుడు సీఎ: కేసీఆర్ అని ఆరోపించారు. రూ. లక్ష రుణ మాఫీ చేయకుండా 5 ఏళ్ల వడ్డీ డబ్బులు వేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. ప్రధాని మోడీ పెట్రోల్ డిజీల్ ధరలు పెంచితే పంచితే, మద్యం ధరలను రెట్టింపు చేసింది సీఎం కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. శ్రీశైలం సొరంగం కాలువను పూర్తి చేయలేని అసమర్థ ప్రభుత్వమని మండిపడ్డారు. మన దెబ్బకు నెల్లికల్ లిఫ్ట్ స్టార్ట్ చేశారన్నారు. తన నియోజకవర్గంలో ఒక నాయకుడికి ఎమ్మెల్యే ఇచ్చారని, మరో సారి అవకాశం ఇస్తే చేయని పనులు పూర్తి చేసి స్వర్గానికి వెల్తానంటూ జానా రెడ్డి వ్యాఖ్యానించారు.