కొప్పుల హరీశ్వర్ రెడ్డి మృతి
దిశ దశ, హైదరాబాద్:
రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో సీనియర్ రాజకీయ నాయకుడు కొప్పుల హరీశ్వర్ రెడ్డి మరణించారు. శుక్రవారం అనారోగ్యంతో మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ఉప సర్పంచ్ నుండి ఉమ్మడి రాష్ట్ర శాసన సభ డిప్యూటీ స్పీకర్ గా పలు పదవులు అలంకరించిన హరీశ్వర్ రెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉండేది. పరిగి నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన హరీశ్వర్ రెడ్డి కుమారుడు మహేశ్వర్ రెడ్డి ప్రస్తుతం ఇక్కడి నుండి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 1947 మార్చి 18న జన్మించిన ఆయన 1972 నుండి ప్రత్యక్ష్య రాజకీయాల్లోకి వచ్చి ప్రజా ప్రతినిధిగా సేవలు అందించడం ఆరంభించారు. 1983లో స్వతంత్ర్య అభ్యర్థిగా పరిగి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన 56 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ తరువాత టీడీపీలో చేరిన ఆయన 1985లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి చట్టసభలోకి అడుగుపెట్టారు. 1986 నుండి 88వరకు ఆగ్రోస్ ఇండస్ట్రీస్ కార్పోరేషన్ ఛైర్మన్ గా, 1988 నుండి 89వరకు టీటీడీ బోర్డు మెంబరుగా, 2009వరకు పరిగి ఎమ్మెల్చేగా గెలిచ్చిన ఆయన 1997 నుండి 2033 వరకు రాష్ట్ర ఆర్థిక సంఘం అధ్యక్షుడిగా పనిచేశారు. 2001 నుండి 2003 వరకు ఉమ్మడి రాష్ట్ర శాసన సభ డిప్యూటీ స్పీకర్ గా పనిచేశారు. 2012లో టీడీపీని వీడిన హరీశ్వర్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరిన స్వరాష్ట్ర ఆకాంక్షకు అనుగుణంగా పోరుబాట వైపు సాగారు. 2014లో ఎమ్మెల్యేగా ఓటమి పాలైన హరీశ్వర్ రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో మాత్రం తనకుంటూ ఓ ప్రత్యేకతను అందిపుచ్చుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సెప్టెంబర్ 22న తుది శ్వాస విడిచారు. ఏ పార్టీలో కొనసాగిన తన బ్రాండ్ ఇమేజ్ ని కాపాడుకుంటూనే ముందుకు సాగారాన్న పేరుగడించిన హరీశ్వర్ రెడ్డ మరణం తెలంగాణకు కూడా తీరని లోటు.
సీఎం సంతాపం
హరీష్వర్ రెడ్డి మరణ వార్త తెలిసిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీనియర్ రాజకీయ నాయకుడు, పలుమార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన మరణం రాష్ట్రానికి తీరని లోన్నారు. ఆయనతో కలిసి పనిచేసిన తనకు వ్యక్తిగతంగా కూడా అనుభందం ఉందని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. హరీశ్వర్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆకాంక్షించారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ కూడా హరీష్వర్ రెడ్డి మృతి పట్ల ప్రగాడ సంతాపాన్ని ప్రకటించారు. క్రీయశీలక రాజకీయ నేతను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ ముదిరాజ్ సంతాపం వెలిబుచ్చారు. రాష్ట్ర మంత్రులతో పాటు పలువురు హరీశ్వర్ రెడ్డి మరణం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
Disha Dasha
1884 posts
Prev Post
Next Post